Breaking News

కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన

Published on Sat, 12/13/2025 - 05:11

సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నియోజక వర్గాల్లో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యా­లయాలకు తరలించే ప్రక్రియతో ప్రజల మనోగతం మరోసారి స్పష్టమైందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులతో శుక్రవారం ఆయన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఎమ్మెల్యే/కో–ఆర్డినేటర్లు, పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్లు, సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్లు, స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్లు, పార్లమెంట్‌ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు (కో ఆర్డినేషన్‌), ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్‌), జెడ్పీ చైర్‌పర్సన్‌లు, మేయర్లు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్య­క్షులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ వైస్‌చైర్మన్లు , జెడ్పీ­టీసీలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లతోపాటు కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 15న జిల్లా స్థాయిలో నిర్వహించే ర్యాలీలతో రాష్ట్రం హోరెత్తాలని, తద్వా­రా మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి గళం విప్పా­లని సూచించారు.

ఈ కార్యక్రమంలో అన్ని వర్గా­లకు భాగ­స్వామ్యం కలి్పంచాలన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సంతకాల సేకరణ చేపట్టిన పార్టీ శ్రేణులను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. చంద్ర­బాబు అప్రజాస్వామిక నిర్ణయాలకు ఇంతకుమించిన రెఫరెండం అక్కర్లేదన్నారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం వైఎస్‌ జగన్‌.. పార్టీ ముఖ్య నేతలతో కలిసి గవర్నర్‌కు సంతకాలను అందజేస్తారని వివరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా మన పార్టీ ఒత్తిడి ఉండాలన్నారు.    

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి