Breaking News

1.8 కోట్ల మందికి గ్రామాల్లోనే వైద్యం

Published on Wed, 07/26/2023 - 04:52

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానంతో గ్రామీణ ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా ఇప్పటివరకు 1.8 కోట్ల మంది వైద్యసేవలు పొందారని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలుపై మంత్రి రజిని మంగళవారం మంగళగిరిలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా గర్భిణులకు మరింత సులభంగా ప్రభుత్వ వైద్యసేవలు అందుతున్నాయని చెప్పారు.

గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలపై మరింత పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం అమలవుతున్న తీరు, ఓపీ సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావా­లని అధికారులకు చెప్పారు. రక్తహీనత సమస్యను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామా­ల్లో ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్‌లు అవగాహన కల్పించాలన్నారు.

బీపీ, షుగర్‌ వంటి అసాంక్రమిక వ్యాధులపై రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయి సర్వే చేపట్టాలని సూచించారు. గత ఏడాది ప్రారంభించిన ఎన్‌సీడీ (నాన్‌ కమ్యునికబుల్‌ డిసీజెస్‌) సర్వేలో భాగంగా మొత్తం జనాభాలో ఏకంగా 82.47 శాతం మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌సీడీ బాధితులకు ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా చికిత్స కూడా అందిస్తున్నామని వివరించారు.

తాజాగా మరోసారి సర్వే చేపట్టాలని, సెపె్టంబర్‌ ఒకటో తేదీ నుంచి ఈ సర్వే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం జిల్లాల నోడల్‌ ఆఫీసర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి ఓపీలతోపాటు ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జె.నివాస్, డాక్టర్‌ రామిరెడ్డి పాల్గొన్నారు. 

Videos

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)