Breaking News

గిరిజనులకు అదనపు ‘ఉపాధి’ 

Published on Sat, 06/17/2023 - 04:03

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రతియేటా రూ.151 కోట్ల మేర అదనపు ‘ఉపాధి’ చేకూర్చేందుకు సీఎం వై­ఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఆయా కుటుంబాలన్నిం­టినీ ఉపాధి హామీ పథకంలో ఏటా 150 రో­జుల చొప్పున పనులు పొందే వారి జాబితాలో చే­ర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులపాటు ప్ర­త్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది.

ఉపాధి హామీ చట్టం ప్ర­కా­రం.. సాధారణ కుటుంబాలకు ఏటా గరిష్టంగా వంద రోజుల చొప్పున పనులు కల్పిస్తున్నప్పటి­కీ, అటవీ భూహక్కు పట్టాదారులకు కుటుంబానికి ఏటా 150 రోజులు పనులు కల్పించే వెసులుబాటు ఉంది. దీంతో.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ల­బ్దిదారులు మొత్తం 1,82,316 కుటుంబాలు ఉండగా.. నెలరోజుల క్రితం వరకు ఈ సంఖ్య 72,646 కుటుంబాలు మాత్రమే 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హత ఉన్న జాబితాల్లో పేర్లు నమోదు చేసుకున్నాయి. 

నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌.. 
ఈ నేపథ్యంలో.. అర్హత ఉన్న మిగిలిన కుటుంబాలను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. ఆయా గిరిజన గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లే తమ పరిధిలోని ఆయా అర్హులను గుర్తించి, వారి వివరాలను మండల కేంద్రంలో అప్‌డేట్‌ చేస్తారు.

గత 15 రోజులుగా ఫీల్డ్‌ అసిస్టెంట్లే ఆయా లబ్ది దారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,424 కుటుంబాలను కొత్తగా 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హుల జాబితాలోకి తీసుకొచ్చారు. ఇంకా 55,246 కుటుంబాలను ఈ పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని.. ఈ నెలాఖరుకల్లా అర్హులందరినీ ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వివరించారు.

ఇక ప్రస్తుతం గరిష్టంగా ఏటా వంద రోజుల చొప్పున ఉపాధి హామీ పథకం పనులు పొందుతున్న ఆయా కుటుంబాలు అదనంగా 50 రోజుల ఉపాధి పొందితే ఒక్కో పనిదినానికి గరిష్టంగా రూ.272 చొప్పున రూ.13,600ల వరకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది.  

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)