Breaking News

క్యాష్‌ కొట్టు.. ఎంపానెల్‌మెంట్‌ పట్టు!

Published on Tue, 02/25/2025 - 05:47

సాక్షి, అమరావతి: బీమా విధానం ప్రవేశపెట్టడం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని గాలికి వదిలేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం పథకం అమలు, ట్రస్ట్‌ నిర్వహణను తొమ్మిది నెలల్లో అస్తవ్యస్థంగా మా­ర్చే­సింది. ఇదే అదునుగా మంత్రుల సిఫార్సులతో ట్రస్ట్‌లో మకాం వేసిన కొందరు అధికారులు అడ్డగోలు దోపిడీకి తెర తీశారు. ఎంపానెల్‌మెంట్‌ ప్రక్రియను అవినీతిమయంగా మార్చేశారని ఆస్పత్రుల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు.

గతంలో ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ ఔట్‌ (ఫీఫో) విధానంలో ఎంపానెల్‌మెంట్‌ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించగా ట్రస్ట్‌లో ముఠాగా ఏర్పడిన కొందరు అధికారులు దీనికి తూట్లు పొడిచినట్లు  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం బీమా విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్న నేపథ్యంలో ఎంపానెల్‌మెంట్‌ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని ట్రస్ట్‌ సీఈవోను వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గతేడాది ఆదేశించారు. అయితే సీఈవోలు మారిపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వసూళ్ల దందాకు తెర తీశారు. ఫీఫో విధానాన్ని పక్కన పెట్టి 15 –  20 ఆస్పత్రుల నుంచి డబ్బులు వసూళ్లు చేసి అనుమతులు జారీ చేశారు.  

కొత్త దరఖాస్తులు.. 
ఎన్నికల కోడ్‌ కారణంగా గతేడాది మార్చి నుంచే కొత్త ఎంపానెల్‌మెంట్‌ దరఖాస్తులను తీసుకోవడం నిలిపివేశారు. అయితే ట్రస్ట్‌లో పాగా వేసిన ముఠా ఆన్‌లైన్‌లో ఎంపానెల్‌మెంట్‌ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించి కొన్ని ఆస్పత్రుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు వెల్లడైంది. సీఈవో ఆమోదం అనంతరం ఎంపానెల్‌మెంట్‌ ప్రక్రియ పూర్తయినట్టు ఆస్పత్రులకు నేరుగా మెయిల్‌ వెళ్లే విధానాన్ని నిలిపివేసి లాగిన్‌లు ఇవ్వకుండా కాల­యాపన చేస్తూ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదు­లున్నాయి. రెవెన్యూ మంత్రి సిఫార్సుతో డిప్యుటేషన్‌పై ట్రస్ట్‌కు వచ్చిన ఓ అధికారికి కీలకమైన ఎంపానెల్‌మెంట్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను కట్టబెట్టారు.

ఎంపానెల్‌మెంట్‌ దరఖాస్తుల ఆధారంగా ఆస్పత్రుల్లో తనిఖీలకు ప్రత్యేక బృందాలను నియమించి ఆ నివేదిక ఆధారంగా అన్ని అర్హతలున్న దరఖాస్తులనే ఆమోదిస్తారు. ఈ ప్రక్రియలో పారదర్శకతకు పాతరేసి ఎంపానెల్‌మెంట్‌ విభాగాధిపతిగా ఉన్న సదరు అధికారి ఆస్పత్రుల్లో ఇన్‌స్పెక్షన్‌లు నిర్వహించి, తానే నివేదిక రూపొందించి, ఆమోదించే వరకూ అన్ని పనులను చక్కబెట్టినట్లు తెలుస్తోంది. వైద్య శాఖ మంత్రి సిఫార్సుతో ట్రస్ట్‌లో మరో అధికారి డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. 

నిబంధనల ప్రకారం ఆయన పరిపాలన బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉండగా తనిఖీల పేరిట ఆస్పత్రుల్లో హడావుడి చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. వైద్యులు అందుబాటులో లేకపోవడం, సేవల్లో నిర్లక్ష్యం, ఇలా ఆస్పత్రులపై ఫిర్యాదులు వచి్చన సందర్భాల్లో ట్రస్ట్‌లో పనిచేసే వైద్యులను తనిఖీలకు పంపుతుంటారు. ఇందుకు విరుద్ధంగా నాన్‌–డాక్టర్‌ అయిన సదరు అధికారి తనిఖీలకు వెళ్లడం ఇదే తొలిసారని వైద్య శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇష్టారాజ్యంగా సస్పెన్షన్ల ఎత్తివేత 
ఆస్పత్రులపై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేతలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడటం, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి సంబంధించి సుమారు 10 ఆస్పత్రులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో పాటు పెనాల్టీని తొలగించారు. గుంటూరులో బ్రెయి­న్‌ హెమరేజీ చికిత్సల పేరిట దోపిడీకి పా­ల్పడిన ఓ ఆస్పత్రిపై గత ఏడాది సస్పెన్షన్‌ వేటు వేసి రూ.కోటి పెనాల్టీ విధించారు. ఈ ఆస్పత్రి యాజమాన్యంతో డీల్‌ కుదుర్చుకుని సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో పాటు పెనాల్టీ భారీగా తగ్గించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైద్యులు అందుబాటులో లేని ఓ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సిఫార్సు చేస్తే రెండు వారాలు తిరగకుండానే దాన్ని ఎత్తివేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)