Breaking News

ఇంద్రకీలాద్రి:విరిగిపడిన కొండచరియలు

Published on Mon, 09/11/2023 - 11:57

విజయవాడ: ఇంద్రకీలాద్రి దిగువన కొండచరియలు విరిగిపడ్డాయి. కేశఖండన శాల సమీపంలో ఈ  ఘటన జరిగింది.  గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.  కొండచరియలు పడిన ప్రదేశంలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. 

కొండచరియలు విరిగిపడే సమయంలో అక్కడే ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సురేష్ అనే భక్తుడు నిమిషాల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 10 గంటలకు బైక్ పార్కింగ్ చేసి తనతో పాటు వచ్చిన వారితో కేశఖండన శాలకు సురేష్ వెళ్లే క్రమంలో 5 నిమిషాల వ్యవధిలో పెద్ద శబ్ధంతో కొండచరియలు  విరిగిపడ్డాయి. కొంచెంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని సురేష్ చెప్పాడు. 

కొండచరియలను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలను మొదలు పెట్టారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈవో భ్రమరాంబ. ఆలయం ముందు నుంచి వెళ్లే కుమ్మరిపాలెం-రథం సెంటర్ మధ్య రోడ్డును మూసివేశారు.  వర్షాలు కొనసాగుతుండటంతో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు.  ప్రమాదసమయంలో భక్తులెవరూ లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.  

ఇదీ చదవండి: కర్ణాటక సర్కార్‌కు ఉచితాల సెగ.. బెంగళూరులో నేడు ప్రైవేట్ వాహనాల బంద్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)