Breaking News

‘ఎక్స్‌ప్రెస్‌’ బస్సుల్లో ఉచితం ఇవ్వాలా వద్దా!?

Published on Fri, 01/10/2025 - 06:07

సాక్షి, అమరావతి :  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రధానంగా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేయాలా వద్దా అనే అంశంపై సందిగ్థతతో కొట్టుమిట్టాడుతోంది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే ఈ పథకాన్ని పరిమితంచేస్తే ఎలా ఉంటుంది?.. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తే ఎలా ఉంటుంది?.. అనే దానిపై తర్జనభర్జన పడుతోంది. 

ప్రభుత్వ పెద్దల ఉద్దేశం గ్రహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ రెండు రకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. అయినా.. ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం.   

ఎన్నికల హామీని నీరుగార్చేదెలా.. 
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేస్తామనే టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇచి్చంది. దీని ప్రకారం.. అన్ని కేటగిరీల బస్సుల్లో ఉచితంగా అమలుచేయాలి. కానీ, ఈ పథకాన్ని నీరుగార్చేందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యత్నిస్తోంది. 

అందుకే ఈ తరహా పథకాన్ని అమలుచేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పర్యటనల పేరుతో ఏడు నెలలుగా కాలయాపన చేసింది. ముందు అధికారుల బృందాలు పర్యటించి నివేదిక సమర్పించాయి. అయినాసరే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి మరోసారి పర్యటనలతో కాలం వెళ్లదీశారు. ఆగస్టు 15 నుంచి ఓసారి.. కాదు దసరా నుంచి అని మరోసారి చెప్పుకొచ్చారు.

సంక్రాంతికి కూడా ఈ పథకాన్ని ప్రారంభించడంలేదని తాజాగా వెల్లడించి ఉగాదికి వాయిదా వేశారు. తీరా ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెండు రకాల ప్రతిపాదనలపై చర్చించడం గమనార్హం. కేవలం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే పరిమితంచేస్తే ఎంత భారంపడుతుంది.. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అమలుచేస్తే ఎలా ఉంటుందని చర్చించారు.

ఆ మూడు రాష్ట్రాలు నిధుల కేటాయింపు ఇలా.. 
తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులతో సహా అన్ని కేటగిరీల సర్వీసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేస్తున్నాయి. అందుకోసం ఏటా తమిళనాడు ప్రభుత్వం రూ.6,396 కోట్లు, కర్ణాటక ప్రభుత్వం రూ.5,015 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.4,084 కోట్లు  కేటాయిస్తున్నాయి. కానీ, ఆ స్థాయిలో నిధుల కేటాయింపుపై టీడీపీ కూటమి ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. అందుకే ఈ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోంది.

ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో సహా అన్ని బస్సుల్లో పథకాన్ని అమలుచేయాలంటే.. 
» ఏడాదికి ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు: రూ.3,182 కోట్లు 
»  నెలకు కేటాయించాల్సింది : రూ.265 కోట్లు 
»  ఉచిత ప్రయాణానికి కేటాయించాల్సిన బస్సుల సంఖ్య : 8,193 
»  కొత్తగా కొనాల్సిన బస్సుల సంఖ్య : 2,045 
» కొత్తగా నియమించాల్సిన ఉద్యోగులు : 11,479 (డ్రైవర్లు, కండక్టర్లు, నిర్వహణ సిబ్బంది)

పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే ఈ పథకాన్ని పరిమితం చేస్తే.. 
»  ఏడాదికి ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు :  రూ.2,122 కోట్లు 
»  నెలకు కేటాయించాల్సింది : రూ.177 కోట్లు 
»  ఉచిత ప్రయాణానికి  కేటాయించాల్సిన బస్సుల సంఖ్య :  6,303 
» కొత్తగా కొనాల్సిన బస్సుల సంఖ్య :  1,684 
» కొత్తగా నియమించాల్సిన ఉద్యోగులు: 9,449 (డ్రైవర్లు, కండక్టర్లు, నిర్వహణ సిబ్బంది)  

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)