Breaking News

దళిత పోలీసు అధికారులను వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

Published on Tue, 02/18/2025 - 04:10

సాక్షి, అమరావతి: దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని నాడు చంద్రబాబు కులదురహంకారంతో మాట్లాడారని, ప్రస్తు­తం ఆయన ప్రభుత్వం దళిత పోలీస్‌ అధికారులను వేధిస్తోందని, దళితులు ఆత్మన్యూనతకు గురి చేయాలనే కుట్రతో వ్యవహరిస్తోందని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. ఏపీలో దళిత పోలీస్‌ అధికారులను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ మనోవేదనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్, మరో రిటైర్డ్‌ నాన్‌ క్యాడర్‌ ఎస్పీ విజయ్‌ పాల్‌ పట్ల చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో విమర్శించారు. ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తనను కస్టోడియల్‌ టార్చర్‌ చేశారనే అభియోగాలను గతంలో సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని అయినా సరే మూడున్నరేళ్ల తరువాత కూటమి ప్రభు­త్వం అధికారంలోకి రాగానే రఘురామ పాత ఆరోపణలనే చేయడం..టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే దళితుల్లో మాల సామాజికవర్గానికి చెందిన పీవీ సునీల్‌ కుమార్, మాదిగ సామాజికవర్గానికిచెందిన విజయ్‌పాల్‌లపై కేసు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. 

గుంటూరు జిల్లాలో నమోదు చేసిన ఆ కేసు దర్యాప్తు బాధ్యతను ప్రకాశం జిల్లా ఎస్పీకి అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. పీవీ సునీల్‌ కుమార్‌కు 9 నెలలుగా పోస్టింగు ఇవ్వకుండా వేధిస్తుండటం..విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేసి 2 నెలలపాటు జైల్లో ఉంచడం దళిత అధికారుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)