Breaking News

గోరకల్లు రిజర్వాయర్‌ మరమ్మతులకు రూ.53 కోట్లు

Published on Sat, 08/23/2025 - 03:17

సాక్షి, అమరావతి: శ్రీశైలం కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల్లో అంతర్భగామైన గోరకల్లు (నరసింహరాయ సాగర్‌) రిజర్వాయర్‌ మట్టికట్ట మరమ్మతులకు ప్రభుత్వం రూ.53 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మరమ్మతు పనులు చేపట్టాలని కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈని ఆదేశిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

శ్రీశైలం కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అంతర్భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరకల్లు వద్ద 11 టీఎంసీల సామర్థ్యంతో గోరకల్లు రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ మట్టికట్ట గతేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. రివిట్‌మెంట్‌ కుంగిపోయింది. భారీ గోతులు ఏర్పడ్డాయి. రిజర్వాయర్‌ భద్రత దృష్ట్యా తక్షణం మట్టికట్ట మరమ్మతులకు రూ.58.90 కోట్లు మంజూరు చేయాలని గతేడాది డిసెంబర్‌ 12న కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 

కానీ.. అప్పట్లో ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టికట్ట మరింతగా దెబ్బతింది. ఇది రిజర్వాయర్‌ భద్రతను ప్రశ్నార్థకం చేసింది. మట్టికట్టసహా రిజర్వాయర్‌ భద్రతకు అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది జూలై 4న కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈ ప్రభుత్వానికి మరోసారి నివేదిక పంపారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)