Breaking News

ఇవిగో సాక్ష్యాలు.. రోడ్డెక్కితే బాదుడు నిజమే

Published on Tue, 12/23/2025 - 05:32

సాక్షి, అమరావతి: ‘‘రోడ్డెక్కితే బాదుడే’’ అనేది ముమ్మాటికీ నిజమని తేలింది..! ‘సాక్షి’ కథనం అక్షర సత్యమని స్పష్టమైంది..! రహదారుల–భవనాల శాఖ వివరణే దీనికి నిదర్శనంగా నిలిచింది...! హైబ్రిడ్‌ యాన్యుటీ (హెచ్‌టీ) పద్ధతిలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణంలో ప్రజల జేబులను గుల్లచేసేలా చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన నిర్వాకాన్ని ఎండగడుతూ రోడ్డెక్కితే బాదుడే శీర్షికన ఆదివారం ‘సాక్షి’ కథనం ఇచి్చంది. దీనికి ఆర్‌అండ్‌బీ శాఖ వివరణ ఇచి్చంది. దీనికిముందు జరిగిన తతంగం చూస్తే, గత నెల 26న సీఎం చంద్రబాబు నిర్వహించిన ఆర్‌అండ్‌బీ శాఖ సమీక్షలో ఏడాదికి పెట్రోల్, డీజిల్‌పై రూపాయి సెస్‌ ద్వారా రూ.732 కోట్లు, గనులు, ఖనిజాలపై 10 శాతం సెస్‌తో రూ.441 కోట్లు, మోటారు వాహనాల పన్నుపై 10 శాతం సెస్‌తో రూ.350 కోట్లు ఆదాయం వస్తుందని ప్రజంటేషన్‌ ఇచ్చారు. దీంతో రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌... ఆరి్థక సంస్థల నుంచి అప్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. 

ఇక హైబ్రిడ్‌ యాన్యుటీలో కేంద్రం విధి విధానాల ప్రకా­రం టెండర్లు పిలుస్తామని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం లేదని, రెండు లేన్ల రహదారులు కాదని ఆర్‌అండ్‌బీ శాఖ పేర్కొంది. కానీ, 2 లేన్లలోనే మూడు దశల్లో 1,500 కిలోమీటర్ల రోడ్లను హెచ్‌టీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి రూ.15,326 కోట్లు వ్యయం అవుతుందని సీఎం సమీక్షలో పేర్కొన్నారు. అంటే, కిలోమీటర్‌కు రూ.10 కోట్లు కాదా? 

⇒  మరోవైపు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని శాఖ వివరణ ఇచ్చింది. కానీ, సీఎం సమీక్షలో వారు ఇచ్చిన ప్రజంటేషన్‌లోని ప్రతిపాదనలే దీనికిఇ సాక్ష్యంగా నిలిచాయి. 1,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టడానికి భూ సేకరణ, మౌలిక వసతులు (యుటిలిటీస్‌)కు రూ.4 వేల కోట్లను ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుందని పేర్కొన్నారు. హెచ్‌టీ విధానంలో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం డెవలపర్‌ వ్యయం చేస్తారని రహదారులు–భవనాల శాఖ వివరణ ఇచి్చంది. ‘సాక్షి’ కూడా ఇదే చెప్పింది. 

⇒  16 ఏళ్లలో ఆరు నెలలకోసారి డెవలపర్‌కు అసలు, వడ్డీ చెల్లిస్తారని సాక్షి పేర్కొంటే 15 ఏళ్లు అని ఆర్‌అండ్‌బీ శాఖ వివరించింది. మొత్తం వ్యయం ప్రజల నుంచే గుంజడం అవాస్తవమని తెలిపింది. కానీ, సెస్‌ల కింద ఏటా రూ.1,636 కోట్లు, టోల్‌ వసూలుతో రూ.375 కోట్లు వస్తుందని సీఎం సమీక్షలో పేర్కొన్నారు. ఈ లెక్కన 15 ఏళ్లలో రూ.24,540 కోట్లు, రూ.5,625 కోట్లు వసూలవడం  వాస్తవం కాదా? ఈ రెండూ కలిపి రాష్ట్ర ప్రజలపై మొత్తం భారం రూ.30,165 కోట్లు కావడం లేదా? ఇక సెస్‌లను 16 ఏళ్లుగా సాక్షి పేర్కొంది. కానీ ఒకసారి సెస్‌ వేశాక అది ఎన్నేళ్లైనా కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు.  

చంద్రబాబు మార్క్‌ బాదుడు 
ఏడు రోడ్లు అభివృద్ధి చేసి టోల్‌ వసూలుకు నిర్ణయం  
కన్సల్టెంట్‌కు డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతలు  
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం హైవేలపైనే టోల్‌ వసూలు చేస్తే... చంద్రబాబు సర్కార్‌ మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలోని రెండు వరసల రోడ్లపై కూడా టోల్‌ బాదాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలి దశలో ప్రస్తుతం రెండు వరుసల్లో ఉన్న ఏడు రోడ్లను అభివృద్ధి చేసిన తర్వాత టోల్‌ వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ ఏడు రోడ్లకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన బాధ్యతలను కన్సల్టెంట్‌కు అప్పగించాలని నిర్ణయించింది.

470 కిలో మీటర్ల మేర ఏడు రోడ్లను రెండు వరసల్లో పటిష్టం చేసేందుకు గుర్తించారు. భూ సేకరణ అవసరం లేకుండా వాటిని 470 కిలో మీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.936 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. తర్వాత ఆ రహదారులపై టోల్‌ వసూలు ద్వారా ఏడాదికి రూ.96.03 కోట్లు రాబడి వస్తుందని, దాని ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మిగతా రోడ్లను అభివృద్ధి  చేయాలని నిర్ణయించింది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు