Breaking News

టెంపో మీదకు దూసుకొచ్చిన కంటైనర్‌!

Published on Tue, 07/01/2025 - 05:34

కురబలకోట (అన్నమయ్య జిల్లా): వేగంగా దూసుకొచ్చిన కంటైనర్‌ టెంపోను ఢీకొట్టి ముగ్గురి ప్రాణాలను బలిగొంది. పదిమందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కుర­బలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద సోమవా­రం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని బాగేపల్లెకు చెందిన నరసింహారెడ్డి, రామచంద్రప్ప, శివప్ప కుంటుంబాలకు చెందిన 15 మంది తిరుమల దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చెన్నామర్రి వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్‌ ఒక్కసారిగా వీరు ప్రయాణిస్తున్న ట్రావెలర్‌ టెంపోను ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో మేఘర్‌‡్ష(16), చరణ్‌(17), శ్రావణి(24) అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108, పోలీస్‌ వాహనాల్లో మదనపల్లె ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్ణాటకలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్‌ మంజునాథ కోమాలోకి వెళ్లారు. టెంపోను ఢీకొట్టిన కంటైనర్‌ లారీతో పాటు డ్రైవర్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మదనపల్లె రూరల్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు. 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 
చెన్నామర్రి మిట్ట రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, మరో పదిమంది గాయపడడం పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)