Breaking News

ఆయువిచ్చిన అమ్మ వెంటే...

Published on Tue, 12/30/2025 - 03:21

హిందూపురం టౌన్‌/ పెనుకొండ : తీవ్ర రక్తస్రావంతో మృతిచెందిన తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా... ఆ వాహనానికి ప్రమాదం జరగడంతో అందులో ఉన్న నవజాత శిశువు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది. హృదయాలను కలిచివేసే ఈ దుర్ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. హిందూపురం ఆస్పత్రి నుంచి వైద్యులు అనంతపురం రిఫర్‌ చేయడం వల్లే తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం బసవనపల్లికి చెందిన నజ్మాకు బత్తలపల్లికి చెందిన కలీంతో రెండేళ్ల క్రితం వివాహమైంది.

నజ్మాకు పురిటి నొప్పులు రావడంతో రెండో కాన్పు కోసం ఆదివారం హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం జరిగిన కొద్ది సేపటికే నజ్మాకు తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు బీపీ పెరగడంతో  వైద్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ నజ్మా మృతి చెందింది. సోమవారం ఉదయం ప్రభుత్వ అంబులెన్స్‌లో నజ్మా మృతదేహంతోపాటు నవజాత శిశువును తీసుకుని కుటుంబ సభ్యులు బసవనపల్లికి బయలుదేరారు.

మార్గంమధ్యలో పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవజాత శిశువు అక్కడికక్కడే చనిపోయింది. వాహనంలోని ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.  హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే మెరుగైన చికిత్స అందించి ఉంటే తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచేవని... అనంతపురం రిఫర్‌ చేయడం వల్లే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)