Breaking News

నారా లోకేశ్‌ టూర్‌లో ప్రమాదం

Published on Fri, 11/07/2025 - 04:17

ఉలవపాడు: మంత్రి నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు వెళితే కూలి డబ్బులు ఇస్తారనే ఆశతో వెళ్లిన 11 మంది పేద మహిళలు... టీడీపీ నేతల కక్కుర్తి కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. లోకేశ్‌ గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారని, స్వాగతం పలకడానికి గుడ్లూరు మండలం మోచెర్ల వస్తే ఒక్కొక్కరికి రూ.300 కూలి ఇస్తామని ఉలవపాడు మండలంలోని కరేడు పంచాయతీ టీడీపీ నాయకులు అలగాయపాలెం ఎస్సీ కాలనీ మహిళలకు చెప్పారు.

కానీ, సరిపడా ఆటోలు ఏర్పాటు చేయకపోవడంతో అదే కాలనీకి చెందిన చెరుకూరి హరి ఆటోలో 11 మంది మహిళలు ఇరుక్కుని మోచెర్ల వద్దకు వెళ్లారు. తిరిగి అలగాయపాలెం ఎస్సీ కాలనీకి వస్తూ ఉలవపాడు సమీపంలోని దక్షిణ బైపాస్‌ వద్ద ఉన్న పెట్రోల్‌ బంకులో ఆటోకు డీజిల్‌ కొట్టించుకుని హైవే ఎక్కే సమయంలో నెల్లూరు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు దానిలో ఉన్న మహిళలు అందరూ గాయపడ్డారు. రావినూతల యలమందమ్మ, రావినూతల ప్రభావతి, రావినూతల లక్షి్మ, చెరుకూరి మరియమ్మ, చెరుకూరి లక్ష్మి, చెరుకూరి సునంద, చెరుకూరి అనూష, శిరీషతోపాటు డ్రైవర్‌ హరిని హైవే అంబులెన్స్‌లో ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించారు. రావినూతల నాగమ్మ, రావినూతల ప్రసన్నబేబీ, రావినూతల మరియమ్మకు తీవ్ర గాయా లు కావడంతో ఒంగోలు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)