Breaking News

ఆటోను ఢీకొన్న మినీ వాహనం

Published on Tue, 07/22/2025 - 05:34

శావల్యాపురం: మినీ వాహనం ఆటోను ఢీకొన్న దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన ఇది. వివరాల్లోకి వెళితే,  పల్నాడు జిల్లా, శావల్యాపురం మండలం, కారుమంచి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఒకరు గాయపడ్డారు. బాధితులు శావల్యాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం స్వల్పగాయాలైన వ్యక్తిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లాలని పోలీసులు బాధితులకు సూచించారు. దీంతో ఆటోలో డ్రైవర్‌సహా ఎనిమిది మంది వినుకొండకు బయలుదేరారు.

ఈ క్రమంలో కనమర్లపూడి గ్రామ సమీపాన జాతీయ రహదారి మార్గంలో ఆటోను మినీ వాహనం  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన బత్తుల బ్రహ్మయ్య(34), బత్తుల నాగ మూర్తమ్మ (48), బత్తుల అంజమ్మ (57) సంఘటన స్థలంలో మృతి చెందారు. బత్తుల ముత్యాలమ్మను వైద్యశాలకు తరలించి వైద్యసేవలు అందిస్తుండగా మృతి చెందింది. బత్తుల యశోదకుమారి పరిస్థితి విషమంగా ఉంది. బత్తుల శ్రీనివాసరావు, బింగి వెంకాయమ్మ, డ్రైవర్‌ చల్లా రాంబాబులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదానికి కారణమైన మినీ వాహనం బొప్పాయి మొక్కల లోడుతో యర్రగొండపాలెం నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం కందులవారిపాలెం గ్రామానికి బయలుదేరింది. ప్రమాదంలో మినీ వాహనం డ్రైవర్‌ బిట్రగుంట నరసింహారావు, మొక్కలు తీసుకు వెళుతున్న బర్రిపూడి నరసింహారావు, పాల రేణురెడ్డిలకు గాయాలు కాగా, వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో భారీ వర్షం కురుస్తుండడం గమనార్హం. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)