Breaking News

మహిళా ఎస్‌ఐకు తప్పిన ప్రమాదం

Published on Thu, 05/22/2025 - 09:47

కురబలకోట : మహిళా ఎస్‌ఐ కారును ఐచర్‌వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్‌ఐకు పెనుప్రమాదం తప్పింది. ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ వివరాల మేరకు.. మదనపల్లె రూరల్‌ స్టేషన్‌ మహిళా ఎస్‌ఐ గాయత్రి బుధవారం తంబళ్లపల్లె కోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కారులో మదనపల్లెకు బయలుదేరారు. కడప క్రాస్‌ వద్దకు రాగానే ఎదురుగా టమాటా లోడ్‌తో వచ్చిన ఐచర్‌ వాహనం ఎస్‌ఐ కారును రెప్పపాటున రాసుకుంటూ వెళ్లింది.

 ఈ క్రమంలో ఐషర్‌ వాహనాన్ని డ్రైవర్‌ కంట్రోల్‌ఽ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. అక్కడే బస్సుకోసం వేచి ఉన్న చౌటకుంటపల్లెకు చెందిన రెడ్డెమ్మ(50), నారేవాండ్లపల్లెకు చెందిన అరుణమ్మ(56), కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన వెంకటరమణ(65)లకు తీవ్ర గాయాలయ్యాయి. ముదివేడు టోల్‌ఫ్లాజా సిబ్బంది వారిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

మహిళా ఎస్‌ఐ గాయత్రికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమెను సమీపంలోని ముదివేడు స్టేషన్‌కు తరలించి.. ఆ తర్వాత మదనపల్లె పట్టణంలోని ఇంటికి పంపారు. ఈ సంఘటనపై డ్రైవర్‌పై కేసు నమోదుచేసి ఐచర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ తెలిపారు. అయితే బస్టాపు వద్ద ప్రయాణికులు ఎక్కువమంది వేచి ఉండడంతో వారిపై లారీ పడి ఉంటే పెద్ద ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)