Breaking News

ఘోర ప్రమాదం: రెయిలింగ్‌లోకి దూసుకెళ్లిన కారు

Published on Mon, 02/23/2026 - 11:38

తూర్పు గోదావరి జిల్లా: మండలంలోని సింగన్నగూడెం వద్ద జాతీయ రహదారి–30లో ఆదివారం కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన పురేష్‌గౌడ్‌ (22) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన 9 మంది కూలీలు తమిళనాడుకు కూలి పనుల నిమిత్తం వెళ్లి కారులో తిరిగి స్వరాష్ట్రం వెళుతున్న క్రమంలో సింగన్నగూడెం వద్ద కొత్తగా నిర్మించిన రహదారి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొన్నారు. 

రెయిలింగ్‌ విరిగిపోవడంతో పాటు కారు ముందు భాగం నుంచి మధ్యలోని సీటు భాగంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో పురేష్‌ గౌడ్‌ కడుపులోకి రెయిలింగ్‌ గుచ్చుకోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా, ఇందులో జన్మతి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం తరలించారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ బొడ్డు హేమంత్, ఎస్‌ఐ సురేష్‌ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)