Breaking News

Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Published on Wed, 03/04/2026 - 09:50

సాక్షి,పలమనేరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 

చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు  అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. కారు పూర్తిగా ధ్వంసమైపోయింది. 

సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, మృతులు  కర్ణాటక రాష్ట్రం వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతుల వివరాలు
మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం రాజాజీ నగర్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.  తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. చనిపోయిన వారి వివరాలు మోహన్ దాస్ (71),నాగరాజరావు (61),కుసుమ (61)జయంతి (59), పూజ (33)గా నిర్ధారించారు. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)