పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం

Published on Wed, 05/15/2024 - 06:46

పల్నాడు: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరి పేట-పర్చూరు జాతీయరహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట ఈవూరవారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రవెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు, టిప్పర్‌ పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, టిప్పర్‌ డ్రైవర్‌, నాలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. గాయపడి వారిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చినగంజాం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ఈ  ప్రమాదం జరిగింది. మృతులు బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికలలో ఓటువేసి తిరిగి హైదరాబాదు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాద ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయటంతో  వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. బైపాస్‌ పనులు జరుగుతుండటం.. తారురోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవటం వల్ల టిప్పర్‌ వేగంగా దుసుకువచ్చింది. టిప్పర్‌ డ్రైవర్‌ వేగాన్ని కంట్రోల్‌ చేయకపోవటమే ప్రమాదానికి కారమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

మృతుల వివరాలు..
అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లా
ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా
ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా
ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)