Breaking News

స్కిల్‌ స్కామ్‌లో మీకేమర్థమైంది?: పవన్‌కు ఆర్జీవీ సూటి ప్రశ్నలు

Published on Tue, 09/12/2023 - 06:10

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవల­ప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టును తప్పు­­పట్టిన జనసేన అధ్యక్షు­డు పవన్‌ కళ్యాణ్‌కు ట్విట్టర్‌ వేదికగా సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (ఆర్జీవీ) ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘స్కిల్‌ స్కామ్‌ కేసులో పవన్‌కు ఏమి అర్థమైందో.. నా ప్రశ్నలకు ఒక్క పదంలో జవాబులు ఇవ్వండి’’ అంటూ సోమ­వారం ట్వీట్‌ చేశారు.

సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో అసలు స్కిల్‌ స్కామ్‌ జరిగిందా? లేదా?. ఒకవేళ స్కామ్‌ జరిగితే.. సీబీఎన్‌ (చంద్రబాబు)కు తెలియకుండా జరిగిందా?. రూ.300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా, అధికారులు చెబుతున్నా వినకుండా విడుదల చేశారా?లేదా?. అప్పటి ప్రభుత్వ అధినేతగా చంద్రబాబుకు స్కామ్‌ జరిగిన తర్వాత విషయం తెలిసి ఉంటే వెంటనే దానిపై చర్యలు తీసుకోకపోవడం సరైనదేనా?.

దర్యాప్తులో సేకరించిన సమాచారాన్ని ఎఫ్‌ఐఆర్‌లో ఎప్పుడైనా ఎవరి పేరైనా చేర్చవచ్చన్న విషయం మీకు తెలీదా?. సీఐడీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మి న్యాయమూర్తి బెయిల్‌ ఇవ్వకపోవడం తప్పా? సెక్షన్‌ 409 వర్తిస్తుందని చెప్పి రిమాండ్‌ విధించిన న్యాయమూర్తి అవినీతిపరురాలా? నాయకులంటే 40 ఏళ్లు బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి కాదు.. వాళ్లు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలీదా?’’ అంటూ ప్రశ్నలను పోస్టు చేశారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో ఏమి అర్థమైందో, దానిలోని తప్పులేంటో చెబుతూ పవన్‌ కెమెరావైపు చూస్తూ వీడియోను విడుదల చేయాలన్నారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు