Breaking News

కార్పొరేట్‌ను తలదన్నేలా...

Published on Mon, 07/31/2023 - 05:15

ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనం. ఇది కార్పొరేట్‌ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్‌ పరిషత్‌ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు. 

రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్‌ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు. 

విజయనగరం ఫోర్ట్‌: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్‌ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్‌కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్‌ పరిషత్‌ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి. 

రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం 
జిల్లాలో వైద్య విధాన్‌ పరిషత్‌కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో  నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి  నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్‌.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

ఆస్పత్రులు ఇలా...
ప్రతి ఆస్పత్రిలోని  క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్‌ వార్డులు,  చేంజింగ్‌ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక  సౌకర్యాలతో కూడిన ఆపరేషన్‌ థియేటర్, ఎక్స్‌రే విభాగం,  కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్ప­త్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తు­న్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.

అన్ని వసతులతో...
వైద్య విధాన్‌ పరిషత్‌ పరిధిలో 8 ఆస్పత్రులను  ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  కలెక్టర్‌  ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. 
– డాక్టర్‌ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్‌ఎస్‌)  

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)