Breaking News

భూ అక్రమాలు క్షేత్ర స్థాయిలో కనిపించలేదు

Published on Sun, 08/18/2024 - 05:43

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో భూ అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు చేస్తున్న దు్రష్పచారానికి తెరపడినట్లే. భూ అక్రమాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన రెవెన్యూ శాఖ స్పెషల్‌ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా.. జిల్లా కలెక్టర్‌ హరేందిర ప్రసాద్, జేసీ మయూర్‌ అశోక్‌తో కలిసి శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భూ అక్రమాలు క్షేత్రస్థాయిలో కనిపించలేదని చెప్పారు. 

మాజీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఆయన కుమారుడు దాదాపు 2 వేల ఎకరాల ఫ్రీ హోల్డ్‌ భూములను బెదిరించి రాయించుకున్నారనే ప్రచారంపైనా పరిశీలించామని చెప్పారు. అయితే, జిల్లాలో 2,600 ఎకరాలు ప్రీహోల్డ్‌కు అవకాశం ఉండగా, వాటిలో 626 ఎకరాలు ఫ్రీహోల్డ్‌ చేసి 22ఎ నుంచి తీసివేశారని తెలిపారు. ఇందులో 4 మండలాల పరిధిలోని 133 ఎకరాలు మాత్రమే కొత్త వారి పేరుతో రిజి్రస్టేషన్‌ జరిగిందని చెప్పారు. ఇందులో మాజీ సీఎస్‌కు ప్రమేయం ఉందని చెప్పలేమని స్పష్టం చేశారు. 

చట్టం ప్రకారం 20 ఏళ్లు దాటిన డి పట్టా భూములను ఎవరైనా కొనొచ్చని తెలిపారు. జిల్లాలో అసైన్డ్, డి పట్టా భూములను ఫ్రీ హోల్డ్‌ చేసి, రిజి్రస్టేషన్‌  వంటివి ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. త్వరలో జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నగరం విస్తరించడం, భోగాపురం ఎయిర్‌పోర్టు వల్ల విశాఖలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఏడాది క్రితం వరకు లేఅవుట్లకు అనుమతి ఉందో లేదో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తెలిసేది కాదని, నూతన విధానం వల్ల ఆ సమస్య పరిష్కారమైందని చెప్పారు.  

ఎర్రమట్టి దిబ్బల్లో అనుమతులివ్వలేదు 
ఎర్రమట్టి దిబ్బల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులివ్వలేదని తెలిపారు. అక్కడ కొంత భూమిని చదును చేస్తుండగా, జిల్లా యంత్రాంగం నిలిపేసిందని తెలిపారు. దసపల్లా ఎస్టేట్‌ భూములపై కోర్టు కేసులున్నాయన్నారు. 60 ఎకరాల్లో 14.5 ఎకరాల ప్రభుత్వ భూమిని 22ఎ లో పెట్టారని, మిగతా భూమిని ఏ విధంగా పరిష్కరించాలో మార్గాలను వెదుకుతున్నామని అన్నారు. 

ఎస్టేట్‌ భూములపై సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ ల్యాండ్‌ రెంట్‌ పట్టా ఇవ్వ­డాన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సిటీ మ్యాప్‌ తయారుచేసి, ప్రభుత్వ, ప్రభుత్వేతర భూములను, రోడ్లు, పార్కులు వంటివి రంగులతో చూపుతామని, దీనివల్ల ఆక్రమణలకు ఆస్కారం ఉండదని తెలిపారు. అంతకు ముందు ఆయన కలెక్టర్‌ కార్యాలయంలో భూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)