Breaking News

బలవన్మరణానికి అనుమతించండి

Published on Mon, 10/13/2025 - 09:14

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ‘నేను ఏ తప్పూ చేయకపోయినా సస్పెండ్‌ చేశారు. చేయని తప్పునకు 12 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నా. నాపై మోపిన అభియోగం రుజువు కాలేదు. అయినా రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం వేధిస్తోంది. నేను బతికి ఉండగా పెన్షన్‌ వస్తుందో, రాదో? ఇక ఈ బాధలు పడలేను. బలవన్మరణానికి అనుమతివ్వండి’ అంటూ ఓ విశ్రాంత ఉద్యోగి.. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆదివారం విజయవాడలో మీడియాకు వివరించారు.

2023లో ఉద్యోగ విరమణ..
కాకినాడ జిల్లా కందరాడకు చెందిన పి.వి.వి.ఎస్‌.ఎస్‌.మూర్తి 2007 నుంచి 2011 వరకు ఆ గ్రామ వీఆర్వోగా పనిచేశారు. ఆ తర్వాత సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. 2023 ఆగస్టులో ఉద్యోగ విరమణ చేశారు. కాగా, 2011లో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ఇన్‌పుట్‌ సబ్సిడీలో మూర్తి అవకతవకలకు పాల్పడ్డారంటూ కలెక్టర్‌కు తహసీల్దార్‌ నివేదిక పంపారు. ఎలాంటి విచారణ చేపట్ట కుండా 2013లో మూర్తిని సస్పెండ్‌ చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మూర్తి అనేకసార్లు అప్పటి, ఆ తర్వాతి ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసుకున్నారు.

నిరాధారమని తేల్చినా..
గత ప్రభుత్వంలో విచారణ జరిపి.. అతనిపై మోపిన అభియోగాలు నిరాధారమని విచారణాధికారి తేల్చారు. ఈ నివేదిక పంపి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయినా పూర్తి పెన్షన్‌ మంజూరవ్వలేదు. కోర్టును ఆశ్రయించగా.. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలంటూ 9 నెలల క్రితం ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు. దీంతో తాను మానసికంగా కుంగిపోయానని.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని మూర్తి కన్నీరుపెట్టుకున్నారు. ప్రభుత్వ తీరుతో విసిగిపోయానని.. అందుకే బలవన్మరణం కోసం రాష్ట్రపత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)