Breaking News

రాయనపాడు మీదుగా పలు రైళ్ల పునరుద్ధరణ

Published on Fri, 09/06/2024 - 05:58

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): వరద తీవ్రత తగ్గటంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని రాయనపాడు స్టేషన్‌ పరిధిలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి పలు రైళ్ల రాకపోకలను అధికారులు పునరు­ద్ధరించారు. ఆయా రైళ్లకు రాయపాడులో స్టాపేజీని తొలగించి నిర్దేశించిన ట్రాక్‌లపై నడుపుతున్నారు. 

విశాఖపట్నం–హైదరాబాద్‌ (12727), విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌ (12861), విశాఖపట్నం–నాందేడ్‌ (20811), తిరుపతి– సికింద్రాబాద్‌ (12763), గూడూరు– సికింద్రాబాద్‌ (12709), తాంబరం– హైదరాబాద్‌ (12759), యశ్వంత్‌పూర్‌–లక్నో (12539), చెన్నై సెంట్రల్‌–న్యూఢిల్లీ (12621), పుదుచ్చేరి– న్యూఢిల్లీ (22403), కొచ్చువెల్లి–గోరఖ్‌పూర్‌ (12512), విశాఖపట్నం–ఎల్‌టీటీ ముంబై (18519), విశాఖపట్నం–సాయినగర్‌ షిర్డీ (18503), షాలీమార్‌– హైదరాబాద్‌ (18045), షాలీమార్‌–సికింద్రాబాద్‌ (22849), బెంగళూరు–ధనాపూర్‌ (12295) రైళ్లను పునరుద్ధరించారు.

మల్దా టౌన్‌–సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు
రానున్న దసరా, దీపావళి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ మీదుగా మల్దా టౌన్‌–సికింద్రాబాద్‌ మధ్య ఎనిమిది ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. మల్దా టౌన్‌–సికింద్రాబాద్‌ (03430) ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్‌ 8 నుంచి నవంబర్‌ 26 వరకు ప్రతి మంగళవారం, సికింద్రాబాద్‌–మల్దాటౌన్‌ (03429) ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్‌ 10 నుంచి నవంబర్‌ 28 వరకు ప్రతి గురువారం నడుస్తాయని తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)