Breaking News

బెదిరింపులు తట్టుకోలేక వీసీల రాజీనామా

Published on Sun, 06/30/2024 - 03:51

వెంకటాచలం/గుంటూరు (ఏఎన్‌యూ)/కడప (వై­వీ­యూ): కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శ్రుతిమించాయి. చివరకు ఉన్నత విద్య అందించే విశ్వవిద్యాలయాలపైనా కర్రపెత్త­నం ప్రారంభించింది. వర్సిటీల వీసీలను తప్పుకో­వా­లంటూ బెదిరింపులకు దిగడమేగాక తీవ్ర వేధింపు­లకు గురిచేస్తుండడంతో తట్టుకోలేక వారు రాజీ­నా­మాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే పలు వర్సిటీ­ల వీసీలు రాజీనామా చేయగా.. తాజాగా మరికొంద­రు అదే బాటపట్టారు.

టీడీపీ నేతల వేధింపులను తట్టుకోలేక నెల్లూరులోని విక్రమ సింహపురి యూని­వర్సిటీ వీసీ జీఎం సుందరవల్లి, రిజిస్ట్రార్‌ పి.రామ­చంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీ­నా­మా పత్రాలను రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయానికి శుక్ర­వారం పంపించారు. 

ఈ నెల 5న టీడీపీ, టీఎ­న్‌­ఎస్‌­ఎఫ్‌ నేతలు విశ్వవిద్యాలయంలోకి చొర­బడి వీ­సీ, రి­జిస్ట్రార్లతో పాటు అధ్యాపక బృందాలపై దాడి చేశా­రు. అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశా­రు. కాగా..  యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ రాజీ­నా­మా చేసి వెళ్లిపోవాలని విద్యాశాఖ మంత్రి పీఏ ఫోన్‌ ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి ఒత్తిడి చేస్తు­న్నారు. దీంతో వారిద్దరూ రాజీనామాలు సమర్పించారు.

అదే బాటలో వైవీయూ వీసీ
కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ చింతా సుధాకర్‌ గవర్నర్‌ కార్యాలయానికి రాజీనామా సమర్పించారు. కాగా.. రిజిస్ట్రార్‌ వైసీ వెంకట సుబ్బయ్య రాజీనామాను వీసీ ఆమోదించారు. టీడీపీకి చెందిన ఓ వ్యక్తి విద్యాశాఖ మంత్రి ఓఎస్‌డీగా తాను చేరబోతున్నానని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియమితులైన వీసీలు, రిజిస్ట్రార్‌లు రాజీనామాలు సమర్పించాలంటూ ఫోన్లు చేశారు. 

అనధికార ఓఎస్‌డీ ఫోన్‌కాల్స్‌ పట్టించుకోవాల్సిన పనిలేదని భావించారు. అయితే, తర్వాత రోజు వీసీ­ల వాట్సా‹­³ గ్రూపుల్లో సైతం అందరూ రాజీనామా­లు సమర్పించాలని వీసీలు, రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీనికి తోడు అధికార పార్టీ అను­బంధ విద్యార్థి సంఘాలను విశ్వవిద్యాలయా­లపైకి ఉసిగొల్పి అనవసర రాద్ధాంతం చేస్తూ వచ్చారు. 

వైఎస్సార్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ రాజీనామా
కడప నగరంలోని వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (వైఎస్సార్‌ ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్‌ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి జూన్‌ 5న పదవికి రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీప బంధువు కావడంతో ఈ­య­నపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ విద్యా­ర్థి సంఘాల నాయకులను ఉసిగొల్పారు. 

తాజా­గా శనివారం ఆయన రాజీనామాను ఏఎఫ్‌యూ వైస్‌ చాన్సలర్‌ బానోతు ఆంజనేయప్రసాద్‌ ఆమోదించారు. దీంతో ఆయన తిరిగి మాతృవిశ్వవిద్యా­లయం వైవీయూలో బయో టెక్నాలజీ ఆచార్యులు­గా చేరారు. కాగా.. వైఎస్సార్‌ ఏఎఫ్‌యూ వైస్‌ చాన్సలర్‌ బానోతు ఆంజనేయప్రసాద్‌ సైతం సో­మవారం రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

ఏఎన్‌యూ వీసీ రాజీనామాకు నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) వీసీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వీసీ పి.రాజశేఖర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు రాజీనామా చేస్తున్న తరుణంలో తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు శనివారం పేర్కొన్నారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)