Breaking News

డిజిటల్‌ లావాదేవీలతో పాటు..ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి

Published on Thu, 03/20/2025 - 05:56

సాక్షి, అమరావతి: దేశంలో డిజిటల్‌ చెల్లింపులతో పాటే డిజిటల్‌ ఆర్ధిక మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు 72.05 లక్షల ఘటనల్లో రూ.11,185 కోట్ల మేర ఆర్ధిక మోసాలు జరిగినట్లు మంగళవారం రాజ్యసభలో వెల్లడించింది. వెబ్‌ ఆధారిత చెల్లింపు మోసాల నివేదన, పరిష్కరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌.. సెంట్రల్‌ పేమెంట్స్‌ ఫ్రాడ్‌ ఇన్ఫర్మేషన్‌ రిజిస్ట్రీని అమలు చేసిందని తెలిపింది. 

కాజేసిన డబ్బు మోసగాళ్ల పరం కాకుండా ఆపేందుకు ‘సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌–మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ను ప్రారంభించినట్లు వివరించింది. దీనిద్వారా 13.36 లక్షల ఫిర్యాదుల్లో రూ.4,386 కోట్లు ఆదా చూసినట్లు తెలిపింది. డిజిటల్‌ చెల్లింపు భద్రతా నియంత్రణలపై ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తోందని.. బ్యాంకులు ఇంటర్నెట్, మొబైల్‌ బ్యాంకింగ్, కార్డు చెల్లింపులు మొదలైన వివిధ మార్గాలకు కనీస భద్రతా నియంత్రణలను అమలు చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. 

మోసాల గుర్తింపునకు కృత్రిమ మేధ ఆధారిత టూల్‌ను వినియోగించాల్సిందిగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు సూచించినట్లు చెప్పింది. ఎలక్ట్రానిక్‌–బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమాల ద్వారా మోసాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివరించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)