Breaking News

క్రెడిట్‌ చోరీతో చిక్కిన చినబాబు!

Published on Fri, 11/14/2025 - 05:13

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు తరలి వచ్చేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషిని 2023లో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు సాక్షిగా రెన్యూ పవర్‌ చైర్మన్, సీఈవో సుమంత్‌ సిన్హా ప్రశంసించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగానే తాము ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు నాడు లింక్డిన్‌లోనూ స్వయంగా వెల్లడించారు. 

వాస్తవం ఇలా ఉంటే.. రెన్యూ పవర్‌ని తామే రప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నామంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. విశాఖలో అదానీ డేటా సెంటర్‌ పేరు మార్చి క్రెడిట్‌ చోరీకి పాల్పడ్డ టీడీపీ ప్రభుత్వ పెద్దలు.. పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా, వైఎస్‌ జగన్‌ కట్టించిన ఇళ్ల­లోకి మళ్లీ కొత్తగా గృహ ప్రవేశాలు చేయించి, తామే కట్టించినట్లు డ్రామాలాడారు. 

ఇ­ప్పు­డు విశాఖలో సీఐ­ఐ సమ్మిట్‌ వేదికగా మరో క్రెడిట్‌ చోరీకి శ్రీకారం చుట్టా­రు. క్రెడిట్‌ చోరీలో తండ్రితో పోటీ పడుతున్న నా­రా లోకేశ్‌ రెన్యూ పవర్‌ విషయంలో సా­మా­­జిక మాధ్యమం ‘ఎక్స్‌’­లో పోస్టు చేసి అ­డ్డంగా దొరికిపోయారు.  

తరిమేసింది బాబు సర్కారే..! 
విచిత్రంగా అదే రెన్యూ పవర్‌ సంస్థతో తాజాగా విశాఖ సదస్సుకు ఒకరోజు ముందే చంద్రబాబు సర్కార్‌ ఒ­ప్పందం కుదుర్చుకుంది. అనంతపురం, శ్రీసత్యసాయి జి­ల్లాల నుంచి రెన్యూ పవర్‌ను తరిమేసింది చంద్ర­బాబు ప్ర­భుత్వమే. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ర­ద్దు చేసి 600 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులను క­ర్నూలు జిల్లాకు తరలిస్తూ ఈ ఏడాది జూలై 28న బాబు సర్కార్‌ జీఓ నెం.56 జారీ చేసింది. ఈ నిజాలను వెలుగులోకి తెచ్చిన నెటిజన్లు.. లోకేశ్‌ క్రెడి­­ట్‌ చోరీకి పాల్పడ్డారంటూ మీమ్స్‌తో  దుమ్మెత్తిపోస్తున్నారు. 

రెన్యూ పవర్‌ను తెచ్చిందే వైఎస్‌ జగన్‌.. 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే రెన్యూ పవర్‌తో పెట్టుబడుల ఒప్పందం జరిగింది. 2023 జూన్‌ 20న 300 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టును అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో స్థాపించేందుకు రెన్యూ పవర్‌కు అనుమతిస్తూ జీవో నెం.15ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జారీ చేసింది. అనంతరం 2024 ఫిబ్రవరి 5న అదే సంస్థను మరో 600 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో నెం.16ను వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం వి­డు­­దల చేసింది. 

అంతేకాదు రెన్యూ సంస్థ ప్రాజెక్టులకు అవసరమైన భూ­ము­లు ఆ రెండు జిల్లాల్లో కేటాయించేందుకు కూడా స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ నాడే అంగీకారం తెలిపింది. ఈ జీఓలపై నాటి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న  కె.విజయానంద్‌ సంతకాలు చేశారు. దీన్నిబట్టి రెన్యూ పవర్‌ ప్రాజెక్టులకు వైఎస్‌ జగన్‌ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భూ కేటాయింపులతో సహా 600 మెగావాట్లు, 300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయనేది సుస్పష్టం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)