Breaking News

వార్షిక కౌలుపై పిటిషన్‌ తిరస్కరణ

Published on Thu, 08/31/2023 - 04:27

సాక్షి, అమరావతి: వార్షిక కౌలు చెల్లింపు వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలన్న రాజధాని రైతుల అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం ముందు రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు బుధవారం ఈ అభ్యర్థన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడంలేదని, దీనిపై తాము సింగిల్‌ జడ్జి ముందు పిటిషన్‌ దా­ఖలు చేశామని తెలిపారు.

సింగిల్‌ జడ్జి ప్రభుత్వా­నికి, సీఆర్‌డీఏకు నోటీసులు మాత్రమే జారీ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము అప్పీల్‌ దాఖలు చేయాలని అనుకుంటున్నామని, దీనిపై అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని సింగిల్‌ జడ్జి ముందే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. సింగిల్‌ జడ్జి ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయనప్పుడు దేనిపై అప్పీల్‌ దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తాము ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)