శ్రీశైలానికి తగ్గుతున్న వరద

Published on Wed, 09/18/2024 - 05:11

శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. అయినా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 40,947 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. సోమవారం నుంచి మంగళవారం వరకు శ్రీశైలానికి ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 35,945 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. 

జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 1,05,142 క్యూసెక్కులు విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.962 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.838 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 197.4616 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటి మట్టం 881.70 అడుగులకు చేరింది.   

సాగర్‌ నీటి మట్టం 589.90 అడుగులు 
నాగార్జునసాగర్‌లో మంగళవారం 2 రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా 24,884 క్యూసెక్కులు దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయానికి శ్రీశైలం నుంచి 70,762 క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. 

కుడి కాలువ ద్వారా 10,080, ఎడమ కాలువ ద్వారా 4,613, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 28,785 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1800 క్యూసెక్కులు, వరదకాల్వకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయ నీటిమట్టం  589.90 అడుగుల వద్ద ఉంది. ఇది 311.7462 టీఎంసీలకు సమానం.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)