Breaking News

RBI Report: ఏపీలో జీతభత్యాల వ్యయం భారీగా పెరుగుదల 

Published on Tue, 01/24/2023 - 04:00

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాలు, జీతాల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది. ఎంతగా అంటే.. 67.26 శాతం మేర పెరిగింది. ఇదే సమయంలో మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గడచిన నాలుగేళ్లలో ఈ వ్యయం కేవలం 39.34 శాతం మాత్రమే పెరిగింది. ఈ విషయాన్ని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్‌లపై చేసిన అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అధికంగా రూ.25,086.3 కోట్ల మేర వేతనాలు, జీతాల రూపంలో వ్యయం అవుతోందని నివేదిక పేర్కొంది.

అంటే.. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో జీతభత్యాల రూపంలో అధికంగా 84.5 శాతం వ్యయం అవుతోంది. అలాగే, రాష్ట్రంలో ఈ వ్యయం ఒక్క ఆర్థిక ఏడాదిలోనే ఏకంగా రూ.10 వేల కోట్లు పెరిగింది. చంద్రబాబు హయాం 2018–19లో వేతనాలు, జీతాల వ్యయం రూ.32,743.4 కోట్లు ఉండగా వైఎస్‌ జగన్‌ హయాంలో 2019–20లో రూ.42,673.8 కోట్లకు పెరిగింది.

ఈ గణాంకాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ బడ్జెట్‌ అకౌంట్లను అధ్యయనం చేసిన తరువాత ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే, 2018–19లో వేతనాలు, జీతాల రూపంలో అకౌంట్స్‌ ప్రకారం రూ.32,743 కోట్లు వ్యయం కాగా.. 2022–23లో బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ, 54,768.4 కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. అంటే నాలుగేళ్లలో రూ.22,025 కోట్ల మేర జీతభత్యాల వ్యయం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

 

కొత్త ఉద్యోగాలు, చిరుద్యోగుల వేతనాలు పెంపుతోనే.. 
ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హమీ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసిన విష­యం తెలిసిందే. అలాగే, వివిధ రంగాల్లోని 3.01 లక్షల మంది చిరుద్యోగుల వేతనాలనూ భారీగా పెంచారు. దీంతోపాటు 11వ వేతన సవరణ కమిషన్‌ సిఫార్సుల అమలు, వైద్య ఆరోగ్యశాఖతో పాటు వివిధ శాఖల్లో వేల సంఖ్యలో కొత్తగా ఉద్యోగాలు భర్తీ.. అలాగే, గ్రామ, వార్డు సచివాలయాల్లో పెద్ద­ఎత్తున ఉద్యోగాలు కల్పించడంతో రాష్ట్రంలో జీతభత్యాల వ్యయం భారీగా పెరిగినట్లు ఆర్‌బీఐ తన నివేదికలో స్పష్టంచేసింది.  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)