Breaking News

కంటిపై పొడిస్తే నోట్లోకొచ్చిన్ కత్తి!

Published on Wed, 10/22/2025 - 07:43

కాకినాడ క్రైం/పి.గన్నవరం: దీపావళి పండగ పూట మద్యం తాగి పేట్రేగిపోయిన భర్త, కత్తితో తన భార్య కంట్లో పొడిచాడు. ఆ కత్తి మొన నోటి గుండా బయటకు వచి్చంది. మృత్యువుతో పోరాడుతున్న ఆమెకు కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు పునర్జన్మనిచ్చారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడుమూడి గ్రామానికి చెందిన 35 ఏళ్ల నేలపూడి పల్లాలమ్మ (పల్లవి) భర్త గంగరాజు తాగొచ్చి నిత్యం వేధిస్తుండేవాడు. 

దీపావళి రోజున మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లో కూరలు తరిగే కత్తి తీసుకొని భార్యను చంపే ఉద్దేశంతో తలపై బలంగా పొడవబోయాడు. ఈ క్రమంలో కత్తి గురి తప్పి పల్లాలమ్మ ఎడమ కంటికి పై భాగంలో గుచ్చుకుంది. భార్య విలవిల్లాడుతున్నా వదిలి పెట్టకుండా కత్తిని గంగరాజు బలంగా నొక్కుతూ మరింత లోతుకు దింపాడు. దీంతో, ఆ కత్తి మొన నోటి గుండా బయటకి వచ్చేసింది. ఈ దారుణాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు.

 తక్షణమే స్పందించిన వైద్యులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శస్త్రచికిత్స మొదలు పెట్టారు. రెండు గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్స నిర్వహించి, దిగబడిన కత్తిని విజయవంతంగా తొలగించి, పల్లాలమ్మ ప్రాణాలు కాపాడారు. క్లిష్టతరమైన ఈ శస్త్రచికిత్స జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లావణ్య కుమారి పర్యవేక్షణలో రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌ నేతృత్వంలో జరిగింది. బాధితురాలికి ఎస్‌ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. పల్లాలమ్మ కంటి చూపు, ప్రాణాలు రెండూ నిలిచాయని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి కుటుంబీకులు వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.  

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)