Breaking News

ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గుర్తింపు

Published on Sat, 10/07/2023 - 04:24

సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ప్రకాశం బ్యారేజ్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌ను ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ (ఐసీఐడీ) ఎంపిక చేసింది. నవంబర్‌ 2 నుంచి 8 వరకు విశాఖలో జరిగే ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌లో ప్రకాశం బ్యారేజ్‌కి ఇచ్చే అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అందుకోనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు ఐసీఐడీ డైరెక్టర్‌ అవంతివర్మ తాజాగా లేఖ రాశారు. ప్రకా­శం బ్యారేజ్‌తో కలిపి రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించిన ప్రా­జె­క్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇప్పటికే కేసీ (క­ర్నూ­లు–కడప) కెనాల్, కంభం చెరువు, పోరుమా­మిళ్ల చెరువులను 2020లో.. సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ బ్యా­రేజ్‌ను 2022లో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

 ప్రపంచవ్యాప్తంగా జలవనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించే విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలాలను దేశాలకు అందించడమే లక్ష్యంగా 1950, జూన్‌ 24న ఐసీఐడీ ఏర్పాటైంది.  పురాతన కాలంలో నిరి్మంచి.. ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్లందిస్తున్న సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)