Breaking News

ఉబ్బలమడుగులో కొత్త వృక్షజాతి

Published on Thu, 07/30/2026 - 09:57

తిరుపతి: సత్యవేడు నియోజకవర్గంలోని ఉబ్బలమడుగు పర్యాటక ప్రాంతంలో అరుదైన కొత్త వృక్షజాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూఫోర్బియేసీ కుటుంబానికి చెందిన ఈ వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ క్రోటన్‌ ఉబ్బలమడుగెన్సిస్‌ అని పేరు పెట్టారు. దీన్ని అటవీశాఖ అధికారులు బుధవారం పవన్‌ కళ్యాణ్‌కు చూపించారు. 

కాంబాకం అటవీ ప్రాంతంలో ఈ మొక్క సహజంగా పెరుగుతుండటంతో ఆ ప్రాంతం పేరునే జాతి పేరుగా ఖరారు చేశారు. ప్రధాన అటవీ సంరక్షణాధికారి పి.వి.చలపతిరావు బృందం నిర్వహించిన పరిశోధనల్లో ఈ కొత్త జాతి వెలుగులోకి వచ్చింది. సుగంధ పరిమళం వెదజల్లే ఆకులు, ప్రత్యేక నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలు ఈ మొక్క ప్రత్యేకతలు.

 క్రోటన్‌ అరోమాటికస్‌ జాతికి ఇది దగ్గరి బంధువు అయినా పూర్తిగా భిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అత్యంత పరిమిత ప్రాంతంలోనే లభిస్తుండటం, ఆవాసాలకు ముప్పు ఉండటంతో ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల జీవవైవిధ్య సంపదను మరోసారి చాటిందని, దీని పరిరక్షణకు మరింత కృషి అవసరమని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)