Breaking News

కర్నూలు పెద్దాస్పత్రిలో అరుదైన ఆపరేషన్లు

Published on Mon, 01/08/2024 - 05:09

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభు­త్వ సర్వజన వైద్యశాలలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగంలో మూడు రోజుల్లో ముగ్గురికి మూడు క్లిష్టమైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను కార్డియోథొరాసిక్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ సి. ప్రభా­కర్‌­రెడ్డి ఆదివారం వివరించారు.  

♦ ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన భాగ్యమ్మ (64)కు గుండెలో మూడు రక్తనాళాలు బ్లాక్‌ అయ్యాయి.  వయసు, గుండె పరిస్థితి రీత్యా ఆపరేషన్‌ చేయడం చాలా కష్టం. కానీ ఆమెకు అధునాతన బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ విధానంలో విజయవంతంగా ఆపరేషన్‌ చేయడం వల్ల కోలుకుంది. ఆమెకు కాలిలో నరాలు కూడా సరిగా లేకపోవడంతో ఛాతిలో నుంచే నరాలు తీసి వేశాం. 

♦ వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన పెద్దిరాజు(47) హార్ట్‌ ఫె­యిల్యూర్‌తో ఆసుపత్రికి వచ్చాడు. అతనికి మైట్రల్‌ కవాటం చెడి­పో­యింది. యాంజియోగ్రామ్‌ చేయగా గుండె రక్తనాళాల్లో రెండు బ్లాక్‌లు గు­ర్తించాం. ఇప్పుడు అతనికి మైట్రల్‌ కవాటాన్ని మార్చడంతో పాటు బైపాస్‌ ఆపరేషన్‌ చేయాలి. మైట్రల్‌ కవాటాన్ని ప్లాస్టిక్‌ కవాటంగా మార్చ­డమే గాక, కాలి నుంచి సిరలను తీసి రక్తనాళాలకు బైపాస్‌ చేయడం వంటి ప్రక్రి­యను ఒకేసారి చేశాం. ఈ ఆపరేషన్‌ విజయవంతం కావడంతో అతను కోలుకున్నాడు. పల్మనరి హైపర్‌ టెన్షన్‌ అనే సమస్య ఉండటంతో రికవరీ కొంచెం కష్టమైంది.    

♦ఎమ్మిగనూరుకు చెందిన సరోజ(30)కు టీబీ. ఊపిరితిత్తుల్లో ఫంగల్‌ బాల్‌ చేరి, దగ్గితే రక్తం పడుతుండేది. ఇది ఒక్కోసారి ఎక్కువగా పడితే ప్రాణాపాయం ఏర్పడుతుంది. దీనిని ఆపడం చాలా కష్టం. ఆపరేషన్‌ చేసి ఆ ఊపిరితిత్తిని తొలగించడమే మార్గం. దీన్ని సైతం విజయవంతంగా నిర్వహించాం. ఇంత పెద్ద ఖరీదైన ఆపరేషన్లు అన్నీ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించాం’ అని డాక్టర్‌ సి. ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)