అరుదైన శంఖులిపి శాసనాలు

Published on Sat, 03/01/2025 - 03:36

బి.కొత్తకోట : వైఎస్సార్‌ జిల్లా సిద్దవటం అటవీ రేంజ్‌ పరిధిలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో భారతీయ పురావస్తుశాఖ బృందం రెండో రోజు శు­క్ర­వా­రం జరిపిన పరిశీలనల్లో 15 లేబుల్‌ శాస­నాలు (పేర­్లతో చెక్కిన శాసనాలు) లభ్యమయ్యా­యి. ఇవి అ­రుదైన శంఖులిపి శాసనాలుగా గుర్తించ­గా అందులో ఒకటి మాత్రం బ్రాహ్మిలిపిలో ఉంది. 

ఈ శంఖు లిపి శాసనాలు రాయలసీమలో వెలుగులోకి రావ­డం ఇదే తొలిసారి కావడం పురావస్తుశాఖ బృందానికి ఆశ్చర్యం కలిగించింది. లభ్యమైన శాసనాలు చెక్కిన చోటును పరిశీలిస్తే రెండు ప్రముఖ శైవ క్షేత్రాల మధ్య అప్పటి తీర్థ యాత్రికుల ప్రాచీన యాత్రా మార్గంగా కనిపిస్తోందని నిర్ధారించారు.  

అన్నీ శంఖులిపి శాసనాలే.. 
సిద్దవటం నుంచి నిత్యపూజకోన ఆలయానికి సమీపంలో అక్కదేవతల ఆలయం ఉంది. రెండు వా­గు­ల ప్రవాహం కలిసే చోటు ఉన్న కొండ నిటారుగా ఉంది. పురావస్తుశాఖ బృందానికి చెందిన డైరెక్టర్‌ ము­నిరత్నంరెడ్డి, యేసుబాబు, రాఘవేంద్రవర్మ, ఎ­ఫ్‌­ఆర్‌ఓ కళావతితో పాటు అటవీ, పురావస్తుశాఖ సి­బ్బంది అతికష్టం మీద కొండపైకి చేరుకున్నారు. కొండపైనుంచి గోపాలస్వామి కోన ఆలయానికి వె­ళ్లే మార్గంగా గుర్తించిన ఈ కొండపై దారి వెంబడి  1­5 శాసనాలను గుర్తించారు. బండలపై చెక్కిన వీ­టి­లో వ్యక్తుల పేర్లు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించా­రు.

నడుచుకుంటూ వెళ్లే మార్గంలో ఈ శాసనా­లు చెక్కి ఉన్నాయి.  నిత్యపూజకోన ఆలయం నుంచి గోపాలస్వామి కోన ఆలయానికి వెళ్లే ఈ మార్గం 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లభ్యమైన శాసనా­ల్లో ఒక రాతి బండపై 4వ శతాబ్దానికి చెందిన బ్రహ్మిలిపిలో చంద్రహాస అని ఒక పేరు, దాని ప­క్క­నే ఆరో శతాబ్దానికి చెందిన శంఖులిపిలో మరో పేరు చెక్కి ఉంది. 6వ శతాబ్దం నుంచి సిద్దమాతృ లిపి పరిణామ క్రమంలో ఈ శంఖు లిపి మొదలైంది. 

దెబ్బతిన్న అక్షరాలు 
శంఖులిపితో లభ్యమైన 14 శాసనాల్లో కొన్నింటి విశ్లేషణ పురావస్తుశాఖ అధికారులకు కొంత క్లిష్టంగా మారింది. కళాత్మక రీతిలో చెక్కిన ఈ పేర్లకు సంబంధించి మధ్యలో ఒక్కో చోట ఒక్కో అక్షరం దెబ్బతింది. దీన్ని విశ్లేషించాలంటే అర్థాలు మారిపోయే అవకాశం ఉంది. దీనితో పూర్తిగా అ«ధ్యయనం చేశాక విశ్లేషించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.  

మార్గంలో ఎన్నో శాసనాలు 
ఉత్తర భారతానికి చెందిన తీర్థ యాత్రికులు నిత్యపూజకోన–గోపాలస్వామి కోన మధ్య దట్టమైన రిజర్వు ఫారెస్టు అయిన శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో రాకపోకలు సాగించినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. అక్కదేవతల కొండపై లభించిన 15 శాసనాలతోపాటు అదే మార్గంలో ఊహించని విధంగా ఎన్నో శాసనాలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 4–6వ శతాబ్దాలకు చెందిన రెండు శాసనాలు ఒకే బండపై చెక్కి ఉన్నాయి.   

లోతైన అధ్యయనానికి ఆధారం 
శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో 4 నుంచి 16వ శతాబ్దం వరకు మానవ మనుగడ, లిపి పరిణామ క్రమానికి సంబంధించి లోతైన అధ్యయనానికి ఆధారాలు లభ్యమయ్యాయి. రెండు రోజుల పరిశోధనలో 27 లేబుల్‌ శాసనాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చెక్కిన మార్గం వెంబడి ఇంకా అన్వేషణ కొనసాగిస్తే చాలా శాసనాలు వెలుగులోకి వస్తాయని అంచనా.  

అతి కష్టంతో సేకరణ 
పురావస్తుశాఖ, అటవీశాఖ సంయుక్తంగా శుక్రవారం చేపట్టిన శాసనాల సేకరణ అతికష్టంతో జరిగింది. అక్కదేవతల ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండపైకి 600 మీటర్లు ఎక్కాల్సి వచ్చింది. ఇది నిటారుగా ఉండటం, దారిలేకపోవడంతో ఎక్కే సమయంలో చిన్న పొరపాటు జరిగినా ప్రమాదం చోటుచేసుకునేది. అక్కడ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా లేవు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే సమాచారం ఇచ్చేందుకు కూడా వీలు లేదు. ఎంతో సాహసంతో మొత్తంగా 12 కిలోమీటర్ల నడక, కొండ ఎక్కడం ద్వారా ఈ శాసనాలను సేకరించారు.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)