Breaking News

విశాఖ బీచ్‌కు కొట్టుకొచ్చిన బాక్స్‌ ఓపెన్‌.. వీడిన సస్పెన్స్‌

Published on Sat, 09/30/2023 - 09:45

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని వైఎంసీఏ బీచ్‌ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చింది. శుక్రవారం రాత్రి కొందరు పర్యాటకులు, మత్స్యకారులు ఈ పెట్టెను గమనించారు. దీంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

కాగా, అధికారులు రెండు ప్రొక్లెయినర్ సాయంతో భారీ పెట్టెను ఓపెన్‌ చేశారు. ఈ క్రమంలో అది చెక్కలతో చేసిన దిమ్మెగా అధికారులు తెల్చారు. కాగా, బీచ్‌లో పడవలకు లంగర్‌ వేసేందుకు ఉపయోగించే చెక్క దిమ్మె అని ఖరారు చేశారు. 

అంతకుముందు.. విశాఖలోని వైఎంసీఏ బీచ్‌ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకున్నారు. పురాతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్‌ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. అలాగే, రాత్రంతా పెట్టెకు పోలీసులు కాపలాగా ఉన్నారు. బీచ్‌లో పెట్టె సమాచారం స్థానికులకు తెలియడంతో దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. పోలీసులు పెట్టెను.. బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు. పురాతన పెట్టె ఇలా ఒడ్డుకు వచ్చిందని ఆర్కియాలజీ విభాగానికి పోలీసులు సమాచారం ఇచ్చారు.

ఇది కూడా చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు...

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)