Breaking News

Fact Check: అది బాబు వదిలేసిన పార్కే..

Published on Sat, 08/12/2023 - 05:36

సాక్షి, అమరావతి: మెగా సీడ్‌ పార్క్‌ అంటూ చంద్రబాబునాయుడు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర అధికారంలో ఉన్నా ప్రాజెక్టుకు పైసా కూడా విదల్చలేదు. ఆయన వేసిన వేల శంకుస్థాపన శిలాఫలకాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోయింది. అయినా ఏనాడూ నోరుమె­దపని రామోజీరావు ఈ పార్కును జగన్‌ ప్రభు­త్వం పట్టించుకోవడం లేదంటూ విషప్రచారానికి ఒడిగట్టారు. ఓ అబద్ధాల కథనాన్ని ఈనాడు అచ్చేసింది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్న చేయి పట్టుకొని నడిపిస్తున్న ప్రభుత్వంపై బురదజల్లుతూ ఈ కథనం వండివార్చింది. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. 

సాధారణంగా పంటల సాగు కోసం బ్రీడర్‌ సీడ్‌ నుంచి ఉత్పత్తి చేసిన ఫౌండేషన్‌ సీడ్‌ను రైతులకు ఇచ్చి వారి ద్వారా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా విత్తనోత్పత్తి చేస్తుంటారు. ఇలా ఫౌండేషన్‌ సీడ్‌ ఉత్పత్తికి రాష్ట్రంలో తొమ్మిది సీడ్‌ ఫామ్స్‌ ఉన్నాయి. వీటి ద్వారా 70 వేల క్వింటాళ్ల ఫౌండేషన్‌ సీడ్‌ ఉత్పత్తి చేస్తారు. ఈ సీడ్‌ను రైతులకు అందజేసి అవసరమైన విత్తనాన్ని తయారు చేస్తారు.  ఏటా 10 లక్షల క్వింటాళ్ల వరి, వేరుశనగ, కందులు, శనగలు, చిరు ధాన్యాల విత్తనాలను తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు. 

ఇలా ఫౌండేషన్‌ సీడ్‌ ఉత్పత్తి చేసే ఫామ్స్‌లో కర్నూలు జిల్లా తంగడంచ సీడ్‌ ఫామ్‌ ఒకటి. 630 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సీడ్‌ ఫామ్‌లో స్థానికంగా డిమాండ్‌ ఉన్న కందులు, శనగల  ఫౌండేషన్‌ సీడ్‌ను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో రూ.670 కోట్లతో మెగా సీడ్‌ పార్కు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. పైసా విదల్చకుండానే 2017 అక్టోబర్‌లో హడావుడిగా శంకుస్థాపన చేశారు.

ఆ తర్వాత ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ దీనిని పట్టించుకోలేదు. అయితే ఈ తంగడంచలోని సీడ్‌ పార్కును వివిధ పంటల హైబ్రిడ్‌ సీడ్‌ మూల విత్తన ఉత్పత్తి క్షేత్రంగా రూపొందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈ పార్కు కోసం 2018లోనే అప్పటి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందంటూ ఓ పెద్ద అబద్ధాన్ని ఈనాడు అచ్చేసింది. నిజంగా ని«ధులు కేటాయించి ఉంటే శంకుస్థాపన చేసిన తర్వాత ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్న బాబు ఎందుకు గాలికొదిలేశారో రామోజీకే తెలియాలి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)