Breaking News

రామిరెడ్డిపై కేసు కక్షసాధింపే

Published on Fri, 09/05/2025 - 03:36

సాక్షి, అమరావతి: తనపై నెల్లూరు జిల్లా జలదంకి పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసును కొట్టేయాలని కోరుతూ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసు డైరీ, ఇతర వివరాలను కోర్టు ముందుంచేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చి­ంది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు ప్రతాప్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయ­వాది వీఆర్‌ మాచవరం వాదనలు వినిపించారు. 

రాజకీయ కక్ష సాధింపు, దురుద్దేశాలతోనే పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లేవీ పిటిషనర్‌కు వర్తించవన్నారు. పిటిషనర్‌కు పలు విద్యా సంస్థలున్నాయని, వాటికి సంబంధించి రోజూవారీ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాల్సి ఉందన్నారు. సంబంధంలేని వ్యవహారంలో నిందితునిగా చేర్చారన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను హత్య చేయించేందుకు పిటిషనర్‌ కుట్ర పన్నారని తెలిపారు. 

నల్లపరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన సందర్భంగా తన విధులకు ఆటంకం కలిగించారంటూ స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మాలకొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై గురువారం విచా­రణ జరిగింది. 

ఇదే అంశానికి సంబంధించిన కేసు­ను కొట్టే­­యాలని కోరుతూ నల్లపరెడ్డి గతంలో దాఖలు చేసిన వ్యాజ్యంతో  ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను జత చేయాలని రిజి­స్ట్రీని హైకోర్టు ఆదేశించింది. రెండు వ్యాజ్యాలను కలిపి విచా­రిస్తామని, తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)