Breaking News

సీపీఐలో వర్గపోరు!

Published on Wed, 08/27/2025 - 05:40

సాక్షి, అమరావతి: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్‌ విభాగంలో వర్గపోరు తారస్థాయికి చేరింది. దీంతో నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోకుండానే మహాసభలను ముగించేశారు. సీపీఐ నాయకులు ప్రతి రెండేళ్లకొకసారి మహాసభలు నిర్వహించి.. రాష్ట్ర కార్యదర్శిని, రాష్ట్ర ముఖ్య నాయకత్వాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. మూడు పర్యాయాలుగా కె.రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో ఒంగోలులో రాష్ట్ర మహాçసభలు జరిగాయి. ఈ సభల్లో.. రామకృష్ణ స్థానంలో మరొకరిని నియమించా­లని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.

తొలుత విశాఖకు చెందిన జేవీవీ సత్యనారాయణమూర్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావించింది. ఆయన ఇటీవల విశాఖపట్నం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా ఎన్నికవ్వడంతో.. ఆ ఆలోచనను విరమించుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావును రాష్ట్ర కార్యదర్శి పదవిలో కూర్చోబెట్టాలని అధినాయకత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను అ­త్యధిక శాతం ప్రతినిధులు(డెలిగేట్స్‌) వ్యతిరేకించారు.

వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య­కు రాష్ట్ర కార్యదర్శి పదవి ఇ­వ్వాలని పట్టుబట్టారు. అనూహ్యంగా వచ్చిన ఈ ప్రతిపాదనతో అధినాయకత్వం షాక్‌కు గురైంది. ముప్పాళ్లకు మార్గం సుగమం చేసేందుకు.. ఈశ్వ­రయ్య వర్గానికి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేసింది. ఈశ్వరయ్యకు మద్ద­తుగా నిలిచిన పలువురు ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ముప్పాళ్లకే పార్టీ పగ్గాలు అప్పగించాలనే పంతం ఎందుకని నిలదీశారు. బీసీ వర్గానికి చెందిన ఈశ్వరయ్యకు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశి్నంచారు.

ఓటింగ్‌ నిర్వహించి రాష్ట్ర కార్యదర్శిని నియమించాలని పట్టుబట్టారు. ఓటింగ్‌ అనివార్యమైతే తమ మద్దతు ఉన్న ముప్పాళ్లకు అవకాశం ఉండదని.. ఈశ్వరయ్యే గెలుస్తారని అధినాయకత్వం గుర్తించింది. అలా జరగకుండా చర్యలు తీసుకుంది. రాష్ట్ర కార్యదర్శి ఎన్నికను జాతీయ మహాసభల తర్వాత చూద్దామంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితర ముఖ్య నేతలు వాయిదా వేశారు. దీంతో సోమవా­రం రాత్రి 11 గంటలకు రాష్ట్ర కౌన్సిల్‌ను మాత్రమే ఎన్నుకుని.. మహాసభలను ముగించారు. దీంతో సీపీఐ ప్రతినిధులు, కేడర్‌ మొత్తం విస్తుపోయింది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)