రామ్‌గోపాల్‌ వర్మ అరెస్ట్‌.. విడుదల

Published on Wed, 08/13/2025 - 04:14

ఒంగోలు టౌన్‌: సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను ఒంగోలు రూరల్‌ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేశారు.  హైకోర్టు ఆదేశాలను అనుసరించి.. వెంటనే ఆయనను బెయిల్‌పై విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ చిత్రాలను మార్ఫింగ్‌ చేసి ట్విట్టర్‌లో పెట్టారని ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో కేసు నమోదు చేసింది. 

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నేత ముత్తెన రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మపై కేసు నమోదైంది. వర్మ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తొలిసారిగా ఆయన ఫిబ్రవరిలో పోలీసు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 5న మరోసారి విచారణకు హాజరుకావాలని కోరుతూ జూలై 22న పోలీసులు వాట్సప్‌ మెసేజ్‌ పంపించినట్టు సమాచారం. అయితే తాను షూటింగుతో బిజీగా ఉన్నందున 12న విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

మంగళవారంరూరల్‌ సీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు విచారణ మొదలవగా రాత్రి 10 గంటల వరకు సుమారు 11 గంటలకు పైగా పోలీసులు విచారించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయనను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుపై వెంటనే విడుదల చేశారు. 

విచారణ సందర్భంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌ వ్యంగ్య చిత్రాలను ఎవరు పోస్టు చేశారు? ఎక్కడ తయారు చేశారు? దీనివెనక మరెవరైనా ఉన్నారా? ఎవరి ప్రోద్బలమైనా ఉందా? అని ప్రశ్నించినట్టు సమాచారం. విచారణకు వర్మతో పాటు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు హాజరయ్యారు. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)