భగ్గుమన్న విద్యార్థులు

Published on Sat, 07/25/2026 - 04:01

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: ‘నీట్‌’ నిర్వహణలో ప్రభు­త్వ వైఫల్యంపై నిరసన ర్యాలీలు.. ఎన్‌టీఏ రద్దు... ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద యువత దీక్షలకు మద్దతుగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు నిర్వ­హించిన విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ప్రైవే­ట్‌ విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, ఐటీఐ తదితర వృత్తి­వి­ద్యా కళాశాలలు దాదాపుగా మూతపడ్డాయి. విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ పిలుపుతో స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. కేంద్ర మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశా­యి. 

నీట్‌ లీకేజ్‌తో దేశంలో సుమారు 24 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డాయి. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఫార్మసీ పరీక్షలను నిలిపివేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని యూనియన్‌ నాయ­కులను బందరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒంగోలు కలె­క్టరేట్‌ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘా­ల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రాజానగరంలో విద్యార్థులు ధర్నాలు చేపట్టారు. పలుచోట్ల ద్విచక్ర ర్యాలీలు నిర్వహించారు.

అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పుట్టపర్తి­లోని గణేష్‌ కూడలిలో ఉరితాడుతో నిరసన తెలిపి దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. కడపలో పాఠశాలల వద్ద విద్యార్థి సంఘాలకు, పోలీసులకు మధ్య తోపులాట జరి­గింది. పత్తికొండలో పీటీఎం సమావేశాలను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. కాగా, విద్యా­ర్థుల న్యాయమైన పోరాటంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ నిందలు వేసి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)