Breaking News

బీచ్‌ శాండ్‌ మైనింగ్‌లో అక్రమాలను ఎలా నిరోధిస్తారు?

Published on Thu, 02/09/2023 - 14:24

సాక్షి, న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాలు, మూలకాలు లభించే బీచ్‌ శాండ్‌ మైనింగ్‌లో ప్రైవేట్‌ సంస్థలు పాల్గొనేలా అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో  వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అనుబంధ ప్రశ్న వేశారు.

దీనికి పీఎంవో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జవాబిస్తూ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్న సరైనదేనని అన్నారు. గడచిన ఏడెనిమిదేళ్ళలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలలో ఎలాంటి మెరుగుదల కనిపిస్తోందో స్పష్టమవుతుందని అన్నారు. గ్రానైట్‌ తవ్వకాల కోసం లైసెన్స్‌లు పొందిన ప్రైవేట్‌ సంస్థలు అణు రియాక్టర్లలో వినియోగించే థోరియం తయారీకి అవసరమైన మొనజైట్‌ వంటి నిక్షేపాలను భారీగా స్మగ్లింగ్‌ చేశారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరుదైన ఖనిజాలు, మూలకాల స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు. మైనింగ్‌ చేస్తున్న ఖనిజ నిక్షేపాలలో వాటి వివిధ ఆకృతులను నిర్ధారించేందుకు శాటిలైట్‌ ఇమేజింగ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. అరుదైన ఖనిజ నిక్షేపాల మైనింగ్‌లో పాల్గొంటున్నది ప్రైవేట్‌ సంస్థా లేక ప్రభుత్వ రంగ సంస్థా అన్న దానితో నిమిత్తం లేకుండా స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు చేపడుతున్న చర్యలలో తోడ్పడవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని పదేపదే కోరుతున్నామని అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)