Breaking News

రాజేషా.. సతీషా?

Published on Mon, 06/01/2026 - 06:04

సాక్షి, అమరావతి: రాజ్యసభ సీట్ల భర్తీ టీడీపీలో రసకందాయంగా మారింది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సానా సతీష్‌ బాబుకు మళ్లీ అవకాశం దక్కుతుందా లేదా అనే విషయం కూటమిలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనకు ఏడాది క్రితమే ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన పదవీకాలం ముగుస్తుండడంతో రెన్యువల్‌ పార్టీలో ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సానాను పక్కనపెట్టి లోకేశ్‌ వ్యవహారాలను చక్కబెట్టే కిలారు రాజేష్‌ కి అవకాశం ఇస్తారనే చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. ఎలాగైనా సరే ఈసారి రాజేష్‌కి ఎంపీ పదవి ఇప్పించుకోవాలని లోకేశ్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇందుకోసం చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తేవడంతో చేసేది లేక అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజేష్‌ కి అవకాశం ఇచ్చి సానా సతీష్‌ ని పక్కనపెట్టాలనే యోచనలో చంద్రబాబు, లోకేశ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సానా సతీష్‌ , రాజేష్‌ ఇద్దరూ లోకేశ్‌ కోటరీలో కీలక వ్యక్తులు. అయితే పార్టీతో సంబంధం లేని లాబీయిస్ట్‌ సానా సతీష్‌ ఎంపీ కావటాన్ని టీడీపీ సీనియర్లు, ఎల్లో మీడియాకి చెందిన ముఖ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎల్లో మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రచురితమయ్యాయి. మరోవైపు కొన్ని ఆర్టీక, రాజకీయ వ్యవహారాల్లో కూడా తేడా రావడంతో సానా కంటే తన సొంత మనిషి రాజేషే బెటర్‌ అని లోకేశ్‌ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి రాజేష్‌ ని రాజ్యసభకు పంపాల్సిందేనని నిర్ణయించినట్లు సమాచారం. 

కుదిరితే సానాను కూడా కొనసాగించాలని భావిస్తున్నా ఆయన కోసం అంతగా పట్టుబట్టడంలేదు. వారిద్దరిలో ఒకరికే అవకాశం ఇద్దామని చంద్రబాబు చెబుతుండడంతో రాజేష్‌ వైపే లోకేశ్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు సానా సతీష్‌ ఎలాగైనా సరే ఎంపీ స్థానాన్ని రెన్యువల్‌ చేయించుకోవడం కోసం భారీ లాబీయింగ్‌ చేస్తున్నారు. తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి లోకేశ్, చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాజేషా.. సతీషా? అనే చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది.  

మూడు సీట్లకు టీడీపీ వ్యూహం..! 
ఈదఫా ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి మూడు స్థానాలు కావాల్సిందేనని బీజేపీకి సంకేతాలు పంపుతున్నారు. అవసరమైతే జనసేనను పక్క­న పెట్టయినా మూడో స్థానాన్ని చేజిక్కించుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా టీడీపీ నేతలు చెబుతున్నారు.  

రేసులో మరి కొందరు..
పెద్దల సభకు వెళ్లేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని భాష్యం విద్యా సంస్థలకు చెందిన రామకృష్ణ, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహనరావు, సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య తదితరులు అధినేతను కోరుతున్నారు. భాష్యం రామకృష్ణ గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించడంతోపాటు చురుగ్గా పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీ సీటు కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆయన రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తూ ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీకంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో చంద్రబాబు కూడా ఆయన పట్ల సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక గత ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ తప్పిదం చేశానని భావిస్తున్న గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ రాజ్యసభ స్థానం కోసం గట్టిగానే లాబీయింగ్‌ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు మళ్లీ రాజ్యసభలో అడుగు పెట్టేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు సైతం తన రాజ్యసభ కల నెరవేర్చాలని చంద్రబాబును కోరుతున్నారు. వర్ల రామయ్య కూడా తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక మహిళకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నట్లు తెలిసింది. ఆ స్థాయి అర్థబలం ఉన్న మహిళా నేతలు ఎవరున్నారా? అనే అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)