Breaking News

‘టీడీపీకి జనసేన ఎందుకు సహకరించాలి?’

Published on Mon, 02/17/2025 - 10:17

అంబేద్కర్ కోనసీమ, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నిక కూటమిలో చిచ్చు రాజేస్తోంది. రాజోలులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌కు జనసేన నేత యెనుముల వేంకటపతిరాజు పెద్ద షాకిచ్చారు. ఆయనకు మద్ధతు ఇచ్చేది లేదని బహిరంగంగా ప్రకటన చేశారు. 

సోషల్‌ మీడియా వేదికగా జనసేన ఎన్నారై విభాగం నేత వేంకటపతిరాజు చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌(MLC Candidate Rajasekhar) కు జనసేన కార్యకర్తలెవరూ సపోర్టు చేయొద్దు. పార్టీ మీద బతికే నాయకులు మీ వద్దకు వస్తే ‘ఛీ’ కొట్టండి. జనసేన కార్యకర్తలను రోడ్డును పడేస్తే.. నాయకులను కూడా రోడ్డున పడేస్తాం’’.. 

‘‘రాజోలు(Razole)లో పాలన ఏమాత్రం బాగోలేదు. గతంలో వివక్షంలో ఉన్నా పనులు జరిగేవి. ఇప్పుడు అధికారులే మాట వినడం లేదు. యువత , మహిళలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలి. సమయం వృధా చేసుకోవద్దు. ఓటు అడగడానికి వస్తే మొహంపైనే ‘ఎందుకు ఓటు వేయాలి’ అని అడగండి’’ అంటూ అంటూ వరుస పోస్టులు చేశారాయాన.

జనసేనకు ఓటు బ్యాంకు ఉన్న రాజోలులో.. గత కొంతకాలంగా టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చాక జనసేన(Jana Sena) కేడర్‌ను టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక దీన్ని మరింత ముదిరేలా చేసింది. అసలు టీడీపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అంటూ జనసేన నేతలు ప్రశ్నించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.

రాజశేఖర్‌ నేపథ్యం.. 

ఎన్డీయే కూటమి తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ(Godavari MLC Elections) అభ్యర్థిగా పెరబత్తుల రాజశేఖర్‌ పేరును టీడీపీ ప్రకటించింది. 1998లో టీడీపీలో చేరిన రాజశేఖర్‌.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పని చేశారు. 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ టికెట్‌ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే అది జనసేనకు వెళ్లింది. దీంతో అలకబూనిన ఆయన్ని చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బుజ్జగించారు. 

ఇదీ చదవండి: మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)