Breaking News

అనకాపల్లిలో తప్పిన రైలు ప్రమాదం.. పలు ట్రైన్స్‌ ఆలస్యం

Published on Mon, 03/17/2025 - 07:14

 

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. అనకాపల్లి-విజయరామరాజుపేట అండర్‌ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్‌ను క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో సెఫ్టీ గడ్డర్‌ ఢీకొనడంతో రైల్వే ట్రాక్‌ పక్కకి జరిగింది. దీంతో, రైలు ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.

వివరాల ప్రకారం.. అనకాపల్లి పెను ప్రమాదం తప్పింది. అండర్‌ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్‌ను లారీ ఢీకొనడంతో పైన ఉన్న రైల్వే ట్రాక్‌ పక్కకి జరిగింది. ఇదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న గూడ్స్‌ రైలు వచ్చింది. అయితే, ట్రాక్‌ పక్కకి జరిగిన విషయాన్ని గుర్తించిన గూడ్స్‌ లోకోపైలట్‌ వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో, ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా విజయవాడ నుంచి విశాఖ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపేశారు. ఎలమంచిలిలో మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేశారు. కొంత సమయం తర్వాత మరో ట్రాక్‌ పైకి నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌కు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. 

	Anakapalle: క్వారీ లారీ ఢీకొని రైల్వే ట్రాక్ ధ్వంసం

ఇదిలా ఉండగా.. అనకాపల్లిలో క్వారీ లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. దీంతో, అడ్డూ అదుపు లేకుండా బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. పరిధికి మించి లారీల్లో రాయి NOABకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనేక ప్రమాదాలకు క్వారీ లారీలు కారణం అవుతున్నాయి. నేడు బ్రిడ్డిని లారీ ఢీకొంది. నిన్న క్వారీ.. ఎల్‌ఐసీ ఏజెంట్‌ను ఢీకొనడంతో అతడు మృతిచెందారు. ఇక, ఓవర్‌ లోడ్ వస్తున్న లారీ కారణంగా గ్రామాల్లో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. లారీల ఓవర్‌ స్పీడ్‌ కారణంగా గామాస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)