సకాలంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి

Published on Sat, 10/05/2024 - 05:37

సాక్షి, అమరావతి: మూడేళ్ల క్రితం రూ.55 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తామ­ని దక్షిణ­మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపా­రు. వాటిలో కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్‌ పనులు, కొత్త లైన్ల కోసం సర్వే మొదలైన ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అమరా­వతి మీదుగా ఎర్రు­పా­లెం–­నంబూరు మధ్య కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం కోసం రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే­శాఖకు సమర్పించామని ఆయ­న చెప్పారు. 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధిపై ప్రతిపాదనల కో­సం రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే ఉన్న­తాధి­కా­రులు శుక్రవారం విజయవాడలో సమీ­క్షా సమా­వేశం నిర్వహించారు. అనంతరం.. జీఎం మీడియా­తో మాట్లాడారు. గత మూడేళ్లలో 33 రైల్వేస్టే­షన్ల­లో 88 కొత్త లిఫ్టులు, 19 రైల్వేస్టేషన్లలో 218 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించామన్నారు. ఇక 101 మానవరహిత లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించామన్నారు. 

257 లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద ఆర్‌యూబీలు, ఆర్‌ఓబీల నిర్మాణానికి ఆమో­దం తెలిపామన్నారు. అమృత్‌ భారత్‌ పథకం కింద రాష్ట్రంలో 56 రైల్వేస్టేషన్లను రూ.2,593 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నా­రు. కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, అదనపు స్టాపేజీలు, ఆర్‌ఓబీ­లు–­ఆర్‌యూబీల నిర్మా­ణం, ప్రయాణికు­లకు మెరుగైన సౌక­ర్యాల కోసం ఎంపీలు చేసిన ప్రతిపాదనలను సానుకూ­లంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అరుణ్‌­కుమార్‌ జైన్‌ చెప్పారు. 

విజయవా­డలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం రెవెన్యూ, మున్సి­పల్‌ కార్పొరేషన్‌ల­తో కలిసి పనిచేస్తామ­న్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌ల­తోపా­టు ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, సీఎం రమేశ్, జీఎం హరీశ్‌ బాలయోగి, పుట్టా మహేశ్‌కుమార్, కేశినేని శివనాథ్, తెన్నేటి కృష్ణప్రసాద్‌ తదితర ఎంపీలు పాల్గొన్నారు.

Videos

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)