Breaking News

భర్త శాడిజంపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన రాధిక

Published on Tue, 01/13/2026 - 11:40

రాజంపేట : తన భార్య తనపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో.. ఆమె భర్త రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్‌ ఎదుట హంగామా చేసిన సంఘటన రాజంపేట అర్బన్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు చెందిన అఖిల్‌, పుల్లంపేటకు చెందిన రాధిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో కొన్నాళ్లు నివసించారు. వీరికి ఇద్దరు సంతానం. 

భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. మొలకలచెరువులో కొంత కాలం కలిసి ఉన్నారు. కొన్ని రోజుల కిందట రాధిక రాజంపేటలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే భార్య కనిపించడం లేదని మొలకలచెరువులో భర్త ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సీఐ నాగార్జున విచారణ చేపట్టారు. సీఐ నాగార్జునపై అఖిల్‌ ఆరోపణలు చేస్తూ, రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు కింద పడేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై సీఐ నాగార్జున మాట్లాడుతూ అఖిల్‌కు మతిస్థిమితం సరిగా లేదన్నారు. పోలీసులపై అఖిల్‌ వ్యవహరించిన తీరుపై కేసు నమోదు చేశామన్నారు.

ఎస్పీకి ఫిర్యాదు చేశానంటున్న భార్య
భర్త, అత్త, మామపై రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్‌లో.. వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా, గృహ హింస కేసు నమోదు చేశారని అఖిల్‌ భార్య రాధిక మీడియాకు తెలిపింది. తన భర్త తనను కొడుతూ రాక్షస ఆనందం పొందుతున్నాడని, ప్రతి నెల తన ఇంటి నుంచి డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడన్నారు.

 రాకుంటే ఇకపై ఒకటే మానసికంగా వేధింపులు పెడతారన్నారు. పెళ్లయినప్పటి నుంచి మెంటల్‌ రీతిలో తనపై చావబాదేవాడన్నారు. రాయచోటికి వెళ్లి ఎస్పీకి తన భర్త శాడిజంపై ఫిర్యాదు చేశానని ఆమె వివరించారు. తాను కనిపించకుండా పోలేదని, మా అమ్మమ్మ ఇంటికి వచ్చానని తెలిపారు. మొలకలచెరువులో తాను కనిపించలేదని, తప్పుడు ఫిర్యాదు ఎలా చేస్తారన్నారు. తన భర్తతో వివాహమైనప్పటి నుంచి నేటి వరకు తనకు జరిగిన సంఘటనలను ఆమె వివరించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)