Breaking News

ఐదేళ్లు... 65 పేపర్ల లీకులు

Published on Sat, 06/29/2024 - 05:39

సాక్షి, అమరావతి : దేశంలో ప్రశ్నపత్రాల లీకులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు.. దానిపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రశ్నపత్రాల లీకేజీ అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. 

కోసం నిర్వహించే పోటీ పరీక్షలు.. వైద్య, ఇంజినీరింగ్‌ తదితర కోర్సుల్లో చేరేందుకు ప్రవేశపరీక్షలు, వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు లీకుకావడం అంతకంతకూ పెరుగుతోంది. ప్రధానంగా 2019 నుంచి 2024 వరకు ప్రశ్నపత్రాలు లీకులు అమాంతంగా పెరిగాయి. ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఏకంగా 65 రకాల పరీక్షల ప్రశ్నపత్రాలు లీకుకావడం గమనార్హం. 

గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకుల వివరాలివీ..
» 2019–24 మధ్య దేశంలో పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, వార్షిక పరీక్షలకు సంబంధించి 65 ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. వాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాటిలో సైన్యంలో నియామకాల కోసం నిర్వహించిన ఆర్మీ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌–2021, ఉపాధ్యాయుల నియా­మకం కోసం నిర్వహించిన సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటీఈటీ)–2023, నీట్‌–యూజీ–2021, జాయింట్‌ ఎంటన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌–2021 ప్రధానమైవి. 

»    ప్రశ్నపత్రాలు లీకైన వాటిలో 45 పరీక్షలు ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు 45 ఉన్నాయి. మొత్తం మూడు లక్షల ఉద్యోగాల భర్తీకోసం ఆ పరీక్షలు నిర్వహించారు. వాటిలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో టీచర్ల నియామక పోటీ పరీక్షలు, అసోం, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూ–కశ్మీర్‌లలో పోలీసు నియామక పరీక్షలు, ఉత్తరాఖండ్‌ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ పరీక్ష, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్‌లలో జూనియర్‌ 
ఇంజినీర్‌ పోస్టుల భర్తీ పరీక్షలు మొదలైనవి ఉన్నాయి.
»  ఇక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కోసం  నిర్వహించిన 17 ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలూ లీకయ్యాయి. 
»   మొత్తం మీద గత ఐదేళ్లలో ఇలా 65 రకాల ప్రశ్నపత్రాలు లీక్‌ కాగా.. వాటిలో 27 పరీక్షలను రద్దుచేయడంగానీ వాయిదా వేయడంగానీ చేశారు. 
» అలాగే, గత ఐదేళ్లలో 19 రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. మొదటి రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్‌ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎని­మిది ప్రశ్నపత్రాలు, బిహార్‌లో ఆరు లీకయ్యా­యి. గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో నాలుగు చొప్పు­న.. హరియాణా, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో మూడేసి ప్రశ్నాపత్రాలు.. తెలంగాణ, ఢిల్లీ, మణిపుర్‌లలో రెండేసి ప్రశ్నపత్రాలు లీక్‌ కాగా.. జమ్మూ–కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లలో ఒక్కో ప్రశ్నపత్రం లీకైంది. 

శభాష్‌ ఏపీవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఘనత ఇదీ..
2019–24 మధ్య కాలంలో పోటీ పరీక్షల నిర్వహణ దేశవ్యాప్తంగా విఫలమైనప్పటికీ ఏపీకు మాత్రం ఆ మరక అంటలేదు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షలు, ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశపరీక్షలను పకడ్బందీగా నిర్వహించింది. 

ఏకంగా ఒకేసారి 1.50 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్ష, 6,500 మంది పోలీసుల నియామక పరీక్ష, గ్రూప్‌–1, గ్రూప్‌–2 తదితర ప్రవేశ పరీక్షలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)