Breaking News

హంద్రీనీవా విస్తరణ పనుల్లో నాణ్యత డొల్ల

Published on Sat, 06/14/2025 - 04:24

కర్నూలు సిటీ/పత్తికొండ రూరల్‌ : హంద్రీనీవా కాలువ విస్తరణ పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. పనుల్లో నాణ్యతతో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన కాలువ లైనింగ్‌ దెబ్బతిని గండి పడడంతో కర్నూలు, అనంతపురం కడప, చిత్తూరు జిల్లాలోŠల్‌ 6.05 లక్షల ఎకరాలకు సాగు, 33 లక్షల మందికి తాగునీటిని అందించేందుకు హంద్రీనీవాను చేపట్టారు. ఈ కాలువ సర్కిల్‌–1 పరిధిలో 216 కి.మీ వరకు ఉంది. ఇందులో కర్నూలు జిల్లాలో 0 కి.మీ నుంచి 134 కి.మీ వరకు ప్రవహిస్తుంది.

ఏటా 40 టీఎంసీల నీటిని శ్రీశైలం వెనుక జలాల నుంచి (బ్యాక్‌వాటర్‌) ఈ కాలువ ద్వారా తరలించాలనేది లక్ష్యం. అందుకు కాలువను 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. అయితే, ఏటా నీటి ప్రవాహంతో కాలువలో పూడిక పేరుకుపోతుండటంతో ప్రవాహ సామర్థ్యం తగ్గిపోతోంది. ఈ కారణంగా 40 టీఎంసీలలో 60 శాతం నీటిని కూడా తరలించలేని పరిస్థితులు నెలకొ­న్నా­యి. దీంతో ప్రధాన కాలువను విస్తరించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా సుమారు రూ.601 కోట్లతో అంచనాలు వేశారు. 

ప్యాకేజీ–1 కింద రూ.171 కోట్లు, ప్యాకేజీ–2లో రూ.430 కోట్లతో టెండర్లు పిలిచి ప­నులు మొదలుపెట్టారు. 60 శాతం పనులు పూర్తయ్యా­యి. ఇంతలో పత్తికొండ సమీపంలోని పంది­కొన గ్రామం 108 కి.మీ దగ్గర ప్రధాన కాలువకు గండిపడి లైనింగ్‌ దెబ్బతింది. దీనికి కారణం కాల్వ ప­క్కన ఉండే వాగులో నుంచి నీరు రావడమేనని ఇంజనీర్లు చెబుతున్నారు. కానీ, కాల్వ విస్తరణ ప­నుల్లో నా­ణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే లైనింగ్‌ దెబ్బతిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విస్తరణ పనుల్లో నాణ్యతపై అనుమానాలు..
హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు ఈనెల 10లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో కాంట్రాక్టర్లు హడావుడిగా పనులుచేస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే  కాలువ­కు గండిపడి లైనింగ్‌ దెబ్బతినింది. నిజానికి.. అక్కడ నాణ్యమైన బంక మట్టివేసి రోలింగ్‌ చేశాకే లైనింగ్‌ చేయాలి. 

కానీ, నాణ్యతలేని నల్లమట్టి వాడడంవల్లే ఇటీవలి వర్షాలకు సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతినిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై హంద్రీనీవా ఎస్‌ఈ పాండురంగయ్యను వివరణ కోరగా.. కాలువకు ఎలాంటి ప్రమాదంలేదని, కాల్వ పక్కనున్న వంక నీరు కాల్వగట్టుపై నుంచి రావడంతోనే సిమెంట్‌ కాంక్రీట్‌ ఊడిపోయిందన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)