Breaking News

రఘురామకృష్ణరాజుతో కాస్త జాగ్రత్త

Published on Thu, 12/25/2025 - 14:36

సాక్షి, అమరావతి: సీబీఐతో 420 ముద్ర వేయించుకున్న డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు వంటి వ్యక్తులతో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులైన కనకమేడల రవీంద్రకుమార్‌ కాస్త జాగ్రత్తగా ఉండాలని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ సూచించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలోని తన ఖాతాలో బుధవారం ఆయన ఓ పోస్టు పెట్టారు.

కనకమేడల రవీంద్ర కుమార్‌తో గతంలో తీసుకున్న ఫొటోను ప్రస్తుతం రఘురామకృష్ణరాజు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడాన్ని సునీల్‌కుమార్‌ ప్రస్తావించారు. మనీలాండరింగ్‌ ఆరోపణల్లో ఈడీతో నేరం నిరూపితమైన రఘురామకృష్ణరాజు ఆ ఫొటోను ఎలా దుర్వియోగం చేయగలరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. ఆయన్ని కనమేడల రవీంద్రకుమార్‌ తన కార్యాలయం పొలిమేరల వరకు కూడా రానివ్వకూడదని సూచించారు. 

రఘురామకృష్ణరాజు అరాచ‌కాల‌ను గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియా వేదికగా పీవీ సునీల్‌ కుమార్ (PV Sunil KUmar) ఎండ‌గ‌డుతున్నారు. బ్యాంకుల‌ను మోసం చేసిన కేసులో ఆయ‌న త్వ‌ర‌లోనే జైలుకు వెళ‌తార‌ని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు బ్యాంకుల‌ను రూ. 2 వేల కోట్ల మేర మోసం చేసిన వ్య‌వ‌హారానికి సంబంధించి త‌న వ‌ద్ద ఆధారాలున్నాయ‌ని సునీల్ కుమార్ చెప్పారు.

 చ‌ద‌వండి: బ్యాంకుల‌కు రఘురామకృష్ణరాజు టోక‌రా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)