Breaking News

10, 12 తేదీల్లో ‘స్థానిక’ ఉప ఎన్నికలు

Published on Tue, 07/29/2025 - 05:16

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు వివిధ జిల్లా­ల్లోని మూడు ఎంపీటీసీ స్థానాలు, రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని సోమవారం వేర్వేరు నోటిఫికేష­న్లు జారీ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీ­సీ స్థానాలు, మణీంద్రం, వేపకంపల్లి, విడవలూరు–1 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే నెల 12న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

14వ తేదీన ఓట్లను లెక్కిస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రకాశం జిల్లా కొండెపి, తూర్పుగోదావరి జిల్లా కడియపు లంక(కడియం) గ్రామాల సర్పంచ్‌ పదవులకు వచ్చే నెల 10 తేదీ ఉదయం పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తామన్నారు. కొండెపిలో సర్పంచ్‌ పదవితో పాటు అన్ని వార్డులకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు.

ఈ ఉప ఎన్నికలకు ఈనెల 30, 31, వచ్చే నెల 1వ తేదీన నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. 2వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని.. 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు వీలు కల్పించినట్లు పేర్కొన్నారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)