Breaking News

పీఎస్‌ హెచ్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి

Published on Mon, 11/10/2025 - 04:34

సాక్షి, అమరావతి: తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ పీఎస్‌హెచ్‌ఎంలు గళమెత్తారు. పీఎస్‌హెచ్‌ఎంలకు ప్రత్యేక జాబ్‌ చార్ట్‌ ప్రకటించాలని, వారివారి సబ్జెక్టులో మాత్రమే విద్యా బోధనకు వీలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం విజయవాడలో ఏపీపీఎస్‌హెచ్‌ఎం ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వం ముందుంచారు. 

ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. కొత్తగా రూపొందించిన ఈ పోస్టులకు ఎలాంటి జాబ్‌చార్ట్‌ లేదని, తమ పరిధి ఏంటో తమకే తెలియడం లేదని వాపోయారు. హైసూ్కళ్లలో నడుస్తున్న ప్రాథమిక తరగతులకు ప్రత్యేక డైస్‌ కోడ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంపీఎస్‌లలో ఉన్న ఖాళీలు అన్నింటినీ భర్తీ చేయాలని, తమను గ్రేడ్‌–3 హెచ్‌ఎంలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 

ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ టీచర్‌ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు.  అసెస్‌మెంట్‌ పుస్తకాలపై ప్రభుత్వం, విద్యాశాఖ పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధ్యాయులకు యాప్‌ల భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 

ఈ సందర్భంగా పీఎస్‌ హెచ్‌ఎంల సమస్యలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. సమావేశంలో భాగంగా పీఎస్‌ హెచ్‌ఎంల ఫోరం 27 సమస్యలతో కూడిన డిమాండ్ల కరపత్రాన్ని విడుదల చేశారు. సమస్యలపై ఈనెల 12 నుంచి 18 వరకు రాష్ట్ర స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలని ఫోరం నిర్ణయించినట్టు అధ్యక్షుడు తెలిపారు. పరిష్కారం కాకపోతే ఉద్యమానికి సంసిద్ధంగా ఉండాలని తీర్మానించినట్టు వివరించారు. కార్యక్రమంలో 13 ఉమ్మడి జిల్లాల ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)